Shamshera : షంషేరా టీజ‌ర్ రిలీజ్.. తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) !

Updated on Jun 22, 2022 07:12 PM IST
Shamshera : ర‌ణ్‌బీర్ (Ranbir Kapoor) లీడ్ రోల్‌లో న‌టిస్తున్న‌ షంషేరా సినిమా టీజ‌ర్‌ విడుదలైంది.
Shamshera : ర‌ణ్‌బీర్ (Ranbir Kapoor) లీడ్ రోల్‌లో న‌టిస్తున్న‌ షంషేరా సినిమా టీజ‌ర్‌ విడుదలైంది.

Shamshera : బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) టాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్టారు. ఇక‌పై ర‌ణ్‌బీర్ న‌టిస్తున్న సినిమాలు తెలుగులోనూ విడుద‌ల కానున్నాయి. బ్ర‌హ్మాస్త్రం, షంషేరా సినిమాల‌తో ర‌ణ‌బీర్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు.  షంషేరా సినిమా టీజ‌ర్‌ విడుదలైంది. ఈ సినిమాకు క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ షంషేరా చిత్రాన్ని నిర్మిస్తోంది.

పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్
ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) న‌టిస్తున్న 'షంషేరా'కు సంబంధించి ఇటీవ‌లే తెలుగు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 'క‌ర్మ వ‌ల్ల దొంగ‌లం.. ధ‌ర్మంగా స్వ‌తంత్రులం' అనే డైలాగులతో కూడిన ఆ పోస్టర్, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ర‌ణ్‌బీర్ చేతిలో గొడ్డ‌లి .. ఎలాంటి ర‌క్త పాతం సృష్టిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 'షంషేరా' చిత్ర ట్రైల‌ర్‌ను జూన్ 24 రిలీజ్ చేయ‌నున్నారు.

ఓ కరడుగట్టిన పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు హీరో ఏం చేయ‌నున్నార‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇక ఈ చిత్రంలో కూడా ప్రతి నాయకులకు పెద్ద పీటే వేశారు దర్శకుడు. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' సినిమాలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌ను ప్ర‌ద‌ర్శించారు. ఇక 'షంషేరా'లో కూడా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు సంజ‌య్ ద‌త్.

ర‌ణ్‌బీర్ కపూర్, సంజ‌య్ ద‌త్‌ల మ‌ధ్య ఎలాంటి భీక‌ర‌మైన యుద్ధం జ‌రుగుతుందో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. 'షంషేరా' సినిమా హిందీతో పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లో జూలై 22న‌ విడుద‌ల కానుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ 'షంషేరా, 'బ్రహ్మాస్త్రం' సినిమాలతో మొద‌టి సారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

జోరుగా బ్ర‌హ్మాస్త్రం ప్ర‌మోష‌న్లు
బ్ర‌హ్మాస్త్రం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవలే ర‌ణ‌బీర్ వైజాగ్ వ‌చ్చారు. అక్క‌డి అభిమానులు ర‌ణ‌బీర్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. గ‌జ మాల‌తో సత్కరించారు. 'బ్ర‌హ్మాస్త్రం' సినిమా రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల జోరు కొన‌సాగుతోంది. 

ర‌ణ్‌బీర్‌ (Ranbir Kapoor) కు జోడిగా అత‌ని సతీమణి  అలియ భ‌ట్ 'బ్రహ్మాస్త్రం' చిత్రంలో న‌టించారు. 'బ్రహ్మాస్త్రం' సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది. అలాగే 'షంషేరా' చిత్రం జూలై 22న రిలీజ్ కానుంది. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'యానిమ‌ల్‌'లో కూడా ర‌ణ‌బీర్ న‌టిస్తున్నారు.  

Read More: బ్ర‌హ్మాస్త్రం (Brahmastra ) : బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలో.. కింగ్ నాగార్జున (Nagarjuna) ప‌వ‌ర్ ఫుల్ లుక్ రిలీజ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!