ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌లో 'నేనుసైతం' అంటోన్న ఉపాస‌న (Upasana Konidela).. ఎల‌క్ట్రిక్ కారును కొన్న‌ చ‌ర‌ణ్ భార్య‌

Updated on Jul 31, 2022 10:31 AM IST
 రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల  (Upasana Konidela) కాలుష్యం త‌గ్గించే చ‌ర్య‌ల్లో భాగంగా ఎల‌క్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. 
రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల (Upasana Konidela) కాలుష్యం త‌గ్గించే చ‌ర్య‌ల్లో భాగంగా ఎల‌క్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. 

టాలీవుడ్ హీరో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల  (Upasana Konidela) కొత్త కారు వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కాలుష్య నివార‌ణ కోసం ఉపాస‌న ఓ అడుగు  ముందుకు వేశారు. ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసి ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్ష‌ణ‌లో భాగ‌మ‌య్యారు. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌తో మెగా కోడ‌లు ఉపాస‌న‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉపాస‌న ఆడి కంపెనీకి చెందిన కారును కొనుగోలు చేశారు. ఆ కారు విలువ తెలిస్తే షాక్ అవాల్సిందే..

రెడ్ కారు అదిరింది

ఉపాస‌న కొణిదెల‌ (Upasana Konidela) రీసెంట్‌గా రెడ్ క‌ల‌ర్‌ 'ఆడి ఇ-ట్రాన్' కారును కొన్నారు. 'ఆడి ఇ-ట్రాన్' కొత్త‌గా వ‌చ్చిన‌ ఎలక్ట్రిక్‌ కారు. ఈ కారు ధ‌ర దాదాపు రూ.1.66 కోట్లు ఉంటుంది. త‌న కొత్త కారు ఎంతో బాగుందంటూ ఉపాస‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

అంతేకాదు ప్ర‌పంచంలో ప్ర‌తీది అప్‌గ్రేడ్ అవుతోంద‌ని.. అందుక‌నుగుణంగా తాను అప్‌గ్రేణ్ అయ్యాన‌ని చెప్పారు. వాయిస్‌ కమాండింగ్‌ ఆప్షన్ త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని తెలిపారు ఉపాస‌న‌. కాలుష్యం త‌గ్గించే చ‌ర్య‌ల్లో భాగంగా ఊపాస‌న ఎల‌క్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. 

 రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కొణిదెల  (Upasana Konidela) కాలుష్యం త‌గ్గించే చ‌ర్య‌ల్లో భాగంగా ఎల‌క్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. 

ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో రామ్ ఫ్యాన్స్
రామ్, ఉపాస‌న‌ (Upasana) ల ప‌దేళ్ల పెళ్లి బంధం ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా అభిమానులు ఇటీవ‌ల‌
ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ల‌క్ష‌ల మందికి అన్న‌దాన ఏర్పాట్లు చేశారు. ర‌క్త‌దానం కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.  

ఈ ఏడాదిలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతం శంక‌ర్ దర్శ‌క‌త్వంలో రామ్ చరణ్.. 'ఆర్‌సీ 15' లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. హాలిడే ట్రిప్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ప‌లు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

Read More: ఆదర్శప్రాయమైన జంట రామ్ చరణ్ & ఉపాసన .. వీరి విదేశీ టూర్ వెనుక మర్మం ఏమిటి ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!