Ram Charan & Upasana : ఆదర్శప్రాయమైన జంట రామ్ చరణ్ & ఉపాసన .. వీరి విదేశీ టూర్ వెనుక మర్మం ఏమిటి ?

Updated on Jun 11, 2022 01:36 PM IST
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న‌ (Upasana) లు త‌మ మ్యారేజ్ డే ను విదేశాల్లో జ‌రుపుకోనున్నారు. 
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న‌ (Upasana) లు త‌మ మ్యారేజ్ డే ను విదేశాల్లో జ‌రుపుకోనున్నారు. 

హీరో రామ్ చరణ్  (Ram Charan), ఉపాస‌నల పెళ్లి బంధానికి ప‌దేళ్లు పూర్తి కానుంది. వీరి వివాహం 2012 జూన్ 14 తేదిన హైద‌రాబాద్‌లో జ‌రిగింది. రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐదేళ్ల ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల‌తో పెళ్లి బంధంగా మార్చుకున్నారు ఈ జంట‌. ఈ సంవత్సరం రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌లు త‌మ మ్యారేజ్ డేను విదేశాల్లో జ‌రుపుకోనున్నారు. 

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న‌ (Upasana) లు త‌మ 'మ్యారేజ్ డే'ను విదేశాల్లో జ‌రుపుకోనున్నారు. 

ఎంద‌రికో ఆద‌ర్శం రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌లు
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న‌ల ప్రేమ ఎంద‌రికో  ఆదర్శం. ఈ జంట ఒక‌రిని ఒక‌రు గౌర‌వించుకుంటూ.. ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరూ తమ ప్రేమ విష‌యాన్ని పెద్ల‌ల‌కు చెప్పి.. వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

అలాగే ఈ జంట నిత్యం స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటారు. ఇటీవలే ఈ దంపతులు తమ కార్ డ్రైవర్ పుట్టినరోజును దగ్గరుండి జరిపించారు. ఆ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. 

రామ్, ఉపాస‌న‌ల వెడ్డింగ్ ఇటలీలో ..!

ఈ సంవత్సరం రామ్, ఉపాసనల జంట తమ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్‌ను ఇట‌లీలో జ‌రుపుకోనున్నార‌ట‌. వీరు విదేశాల‌కు వెళ్తున్న ఫోటోలు, ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న‌ (Upasana) లు త‌మ మ్యారేజ్ డే ను విదేశాల్లో జ‌రుపుకోనున్నారు. 

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) తన తండ్రి బాటలోనే నడుస్తూ, నటననే కెరీర్‌‌గా ఎంచుకున్నారు. ఇక ఉపాస‌న  ఓ మంచి సక్సెస్ మహిళా వ్యాపారవేత్తగా కొన‌సాగుతున్నారు. హెల్త్ సెక్టార్‌లో తనదైన శైలిలో రాణిస్తున్నారు. అలాగే ప్రజారోగ్యానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను త‌న సోష‌ల్ మీడియా ద్వారా, ఎప్పుడూ తెలుపుతుంటారు ఉపాస‌న .

సోషల్ మీడియాలో కూడా  రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల జంటకు మంచి ఫాలోయింగ్ ఉంది.  బెస్ట్ క‌పుల్ అంటూ ఫ్యాన్స్ ఎప్పుడూ వీరి పోస్టులకు కామెంట్స్ పెడుతూ ఉంటారు.

అలాగే, పిల్లల విష‌యంలో కూడా త‌మ‌కు క్లారిటీ ఉందంటున్నారు ఈ జంట‌.  త‌న‌కు జీవితంలో కొన్ని ల‌క్ష్యాలు ఉన్నాయ‌ని.. వాటిని నెర‌వేర్చాల్సిన బాధ్యత ఉందని ఉపాస‌న (Upasana) గ‌తంలో అనేకసార్లు చెప్పారు. అలాగే పిల్ల‌లు త‌మ వ్య‌క్తిగ‌త విష‌యం అని ఆమె తెలిపారు.  

Read More:  హై ఓల్టేజ్ ప‌వ‌ర్ ఉన్న క్యారెక్ట‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ కోసం శంక‌ర్ సృష్టించాడా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!