రామ్‌ పోతినేని (Ram Pothineni) ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)!

Updated on Sep 04, 2022 06:20 PM IST
రామ్‌ పోతినేని (Ram Pothineni) – పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమా సూపర్‌‌హిట్ అయ్యింది
రామ్‌ పోతినేని (Ram Pothineni) – పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమా సూపర్‌‌హిట్ అయ్యింది

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) – డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్లాక్‌బస్టర్‌‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాలో రామ్ డైలాగ్స్, సాంగ్స్ అన్నీ ఆడియన్స్‌ను ఫిదా చేశాయి. ఇస్మార్ట్‌ శంకర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డారు పూరి జగన్నాథ్ అనే వార్తలు వస్తున్నాయి. ‘లైగర్’ సినిమాతో ఫెయిల్యూర్‌తో జనగణమన సినిమాను కొద్దిగా పక్కన పెట్టి ‘ఇస్మార్ట్ శంకర్2’కు పూరి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్నారు అని సమాచారం.

విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా తెరకెక్కింది. పాన్‌  ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 25వ తేదీన విడుదలైంది. మొదటిరోజునే నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో విజయ్ అభిమానులతో పాటు పూరి ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు.

రామ్‌ పోతినేని (Ram Pothineni) – పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమా సూపర్‌‌హిట్ అయ్యింది

జనగణమన కొద్దిగా పక్కన పెట్టారా..!

లైగర్ తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండతో జనగణమణ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. లైగర్ డిజాస్టర్‌‌ కావడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. జనగణమన సినిమా షూటింగ్‌ ఒక షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయ్యింది. దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్. లైగర్ ఫ్లాప్‌ తర్వాత బడ్జెట్ పరంగా జనగణమన వర్కౌట్ కాదని దర్శకనిర్మాతలు సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

రామ్, పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh) ఇద్దరి కెరీర్‌‌లకు ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమా బూస్టప్‌ ఇచ్చిందనే చెప్పాలి. 2019 జూలై 18న విడుదలైన ఈ సినిమా సీక్వెల్‌తో మరోసారి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని భావిస్తున్నారు పూరీ జగన్నాథ్‌. అలాగే ఇటీవల రామ్‌ పోతినేని (Ram Pothineni) .. ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో హిట్‌ కాలేదు. ప్రస్తుతం రామ్‌ పోతినేని బోయపాటి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు.

Read More : ‘జనగణమన’ తర్వాత సల్మాన్‌ఖాన్ (Salman Khan)తో సినిమా చేయనున్న పూరీ జగన్నాథ్‌ (Puri Jagannadh)!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!