బోయపాటి సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)

Updated on Aug 17, 2022 08:56 PM IST
ది వారియర్ సినిమా తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పారు.
ది వారియర్ సినిమా తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

ఇస్మార్ట్‌ శంకర్ సినిమాతో హిట్‌ ట్రాక్‌లోకి వచ్చారు ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని (Ram Pothineni). ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌తో యూత్‌లో మరింత ఫాలోయింగ్ తెచ్చుకున్నారు రామ్. ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కూడా ప్లాపుల నుంచి బయటపడేసింది.

రెండు వేరియేషన్స్ కలిగిన పాత్రలతో ఆ సినిమాలో రామ్ అదరగొట్టారు. అయితే ఆ తర్వాత రామ్‌ నటించిన 'రెడ్' సినిమా నిరాశపరిచింది.  గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశారు. తమిళ హిట్ సినిమా 'తడం' ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దర్శకుడిగా కిశోర్ తిరుమలకి కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ది వారియర్ సినిమా తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే చెప్పారు.

మరోసారి ప్లాప్‌ రుచి..

'రెడ్' సినిమాతో రామ్‌ మరోసారి ప్లాప్ రుచి చూశారు. దీంతో తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' పై చాలా ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా  కూడా రామ్‌కు నిరాశే మిగిల్చింది. రామ్ ఫ్లాప్స్ లిస్ట్‌లో 'ది వారియర్' కూడా చేరిపోయింది. ప్రస్తుతం రామ్ కున్న ఒకే ఒక హోప్.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. మాస్ యాక్షన్ చిత్రాల్లో నటించడానికి ఉత్సాహం చూపించే రామ్ పోతినేని, మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి దర్శకత్వంలో నటిస్తుండడం అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

బాలకృష్ణ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'అఖండ' చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ రెండు పాత్రల్లో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ మూవీగా తెరకెక్కనుందట.

రామ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మాస్ స్టోరీని బోయపాటి రెడీ చేశారని టాక్. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్‌ను పర్‌‌ఫెక్ట్‌గా సెట్ చేసుకొని హిట్ కొట్టడంలో బోయపాటి స్పెషల్‌ అని చెప్పుకోవాలి. మరి రామ్ పోతినేని (Ram Pothineni)కి బోయపాటి ఏ స్థాయి హిట్టిస్తారో చూడాలి.

Read More : The Warrior Success Meet: 'ది వారియర్' సక్సెస్ మీట్ లో హీరో రామ్ (Ram Pothineni) ఆసక్తికర వ్యాఖ్యలు..!


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!