బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni).. తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్న యంగ్ హీరో

Updated on Aug 29, 2022 09:36 PM IST
హీరో రామ్‌ (Ram Pothineni) తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.
హీరో రామ్‌ (Ram Pothineni) తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ల లిస్టులో ముందుగా వినిపించే పేరు బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రాబరీ బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. 

రామ్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' తరువాత రామ్ చేసిన 'రెడ్', 'ది వారియర్' (The Warrior) సినిమాలు ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. దీంతో ఇప్పుడు బోయపాటి సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం హీరో రామ్‌ (Ram Pothineni) తన లుక్‌ని పూర్తిగా మార్చబోతున్నట్లు సమాచారం. ఇందుకోసం సుమారు 11కిలోల బరువు పెరగనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు రామ్ కూడా ఈ కండిషన్‌కి వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 

మరి ఇంత కష్టపడుతున్న రామ్ కు బోయపాటి (Boyapati Srinu) అయినా భారీ విజయం ఇచ్చి పాన్ ఇండియా స్టార్ అని అనిపిస్తాడో లేదో చూడాలి. ఇక ఈ సినిమాతో బోయపాటి రామ్ కెరీర్ కు ఎలాంటి బూస్ట్ ఇస్తాడో చూడాలి. మొత్తానికి బోయపాటి–రామ్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతోంది.

ఈ సినిమాలో కథానాయికగా రష్మిక (Rashmika Mandanna) పేరు వినిపిస్తోంది. మాస్, ఎమోషన్స్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందబోతోందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

Read More: రామ్‌తో డాన్స్ చేయాలంటే భ‌యం వేసింది : కృతి శెట్టి (Krithi Shetty)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!