Kannada Star Darshan: కన్నడ స్టార్ హీరో దర్శన్‌పై చెప్పుదాడి.. సినిమా ప్రమోషన్స్‌లో నటుడికి చేదు అనుభవం 

Updated on Dec 19, 2022 04:28 PM IST
‘క్రాంతి’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ (Dardhan)పై చెప్పుదాడి జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది
‘క్రాంతి’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ (Dardhan)పై చెప్పుదాడి జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా చెలామణి అవుతున్న వారిలో దర్శన్ (Dardhan) ఒకరు. తనదైన శైలిలో మాస్ డైలాగులు, ఫైట్లతో ఆడియెన్స్‌ను ఆయన ఉర్రూతలూగిస్తుంటారు. దర్శన్‌ను ఆయన అభిమానులు ముద్దుగా ‘డీ బాస్’ అని పిలుస్తుంటారు. ఇటీవల కాలంలో ‘యజమన’, ‘ఒడెయా’, ‘కురుక్షేత్ర’, ‘రాబర్ట్’ లాంటి హిట్స్‌తో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు దర్శన్.

హీరో దర్శన్ ప్రస్తుతం ‘క్రాంతి’ (kranti Movie) అనే సినిమాలో నటిస్తున్నారు. జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం సాయంత్రం ఈ మూవీ నుంచి రెండో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. హోస్పేట్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో దర్శన్‌తోపాటు ఇతర చిత్రబృందం కూడా పాల్గొన్నారు. నటీనటులందరూ స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దర్శన్ వైపు చెప్పు విసిరాడు. అది కాస్తా ఆయన భుజం మీద తగిలింది. ఈ ఘటనతో మూవీ యూనిట్ ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే, ఆ వ్యక్తిని ఏమీ చేయొద్దని దర్శన్ సూచించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

ఈ దాడి ఘటనపై దర్శన్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ‘ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేయడం సరికాదు. కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం’ అని దర్శన్ ఫ్యాన్స్ అంటున్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌పై ఓ ఇంటర్వ్యూలో దర్శన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘నా అభిమానులు నన్ను ఎంతో ప్రేమిస్తారు. అదే పునీత్‌ను తీసుకుంటే.. ఆయన చనిపోయిన తర్వాత విశేష ఆదరణ పొందుతున్నారు. కానీ, నేను బతికి ఉండగానే ఫ్యాన్స్ ప్రేమను పొందుతున్నా’ అంటూ దర్శన్ (Dboss) చేసిన కామెంట్స్ అంతటా దుమారాన్ని రేపాయి. ఈ క్రమంలోనే దర్శన్‌పై పునీత్ అభిమానే దాడి చేశారని అంటున్నారు. దీంట్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. 

ఇక, కొన్ని రోజుల కింద మహిళలను ఉద్దేశించి దర్శన్ చేసిన వ్యాఖ్యలు కూడా విమర్శలకు దారితీశాయి. ‘అదృష్ట దేవతే స్వయంగా ఇంటికి వస్తే వెంటనే ఆమెను దుస్తులు విప్పి ఇంట్లో బందీ చేయాలి. అలా కాకుండా ఒకవేళ మీరు ఆమెకు బట్టలు ఇచ్చేస్తే.. ఆమె వేరే చోటుకు వెళ్లిపోతుంది’ అని అని దర్శన్ చేసిన కామెంట్స్‌పై మహిళలు భగ్గుమన్నారు. స్త్రీలను కించపర్చినందుకే దర్శన్‌పై చెప్పుదాడి జరిగినట్లుగా కూడా చెబుతున్నారు. దీనిపై త్వరలో నిజానిజాలు తెలుస్తాయేమో చూడాలి. ఇక దర్శన్ ఫ్యాన్స్ తమ హీరోకు మద్దతు తెలుపుతూ #WeStandWithDboss అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో వైరల్ చేస్తున్నారు.  

Read more: Telugu Biggboss: బిగ్ బాస్ హోస్టింగ్ నుంచి తపుకుంటున్న నాగార్జున (Nagarjuna).. కొత్త హోస్ట్ ఎవరంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!