పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) చివరి చిత్రం రిలీజ్‌కు రెడీ.. ట్రైలర్‌పై మోడీ (Narendra Modi) ప్రశంసలు
దివంగత నటుడు, కన్నడ పవర్ స్టార్‌గా పేరొందిన పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) భౌతికంగా ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ తాను నటించిన సినిమాలు, చేసిన సేవ ద్వారా ఎప్పుడూ ఆడియెన్స్‌తోపాటు సామాన్య ప్రజానీకం గుండెల్లో ఆయన గుర్తుండిపోతారు. ఇక పునీత్ చనిపోయిన తర్వాత ఆయన నటించిన ‘జేమ్స్’ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పునీత్ యాక్ట్ చేసిన మరో మూవీ రిలీజ్ కానుంది.
అభిమానులు ‘అప్పు’ అని ముద్దుగా పిలుచుకునే పునీత్ రాజ్‌కుమార్ నటించిన ‘గంధడ గుడి’ (Gandhadagudi) సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విడుదల చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పునీత్‌ను గుర్తు చేసుకుంటూ మోడీ ఓ ట్వీట్ చేశారు.
‘పునీత్ ఎప్పటికీ బతికే ఉంటారు’
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు, సినీ ప్రేక్షకుల హృదయాల్లో పునీత్ ఎప్పుడూ బతికే ఉంటారని మోడీ ట్వీట్ చేశారు. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అసమానమైన ప్రతిభతో పునీత్ ఆకట్టుకున్నారని ప్రశంసించారు. ‘గంధడ గుడి’ ప్రకృతి మాతకు, కర్నాటక ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సినిమా. ఈ ప్రయత్నానికి నా శుభాకాంక్షలు’ అని మోడీ చెప్పుకొచ్చారు.
తండ్రి ఒడిలో పునీత్.. హృద్యంగా ట్రైలర్
‘గంధడ గుడి’ పునీత్ నటించిన చివరి సినిమా (Puneeth Last Movie) కానుంది. నేషనల్ అవార్డు విన్నర్ అమోఘ వర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వన్య ప్రాణుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. ఓ ప్రత్యేక దీవికి పునీత్ వెళ్లడం.. అక్కడ వైల్డ్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ చేయడాన్ని ట్రైలర్‌లో చూపించారు.విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ ట్రైలర్‌లో కన్నడ కంఠీరవ, పునీత్ తండ్రి రాజ్ కుమార్ విజువల్ కూడా చూపించారు. చిన్ననాటి పునీత్‌ను ఆయన తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్న ఆ సీన్ ఎంతో హృద్యంగా ఉంది.
తెలుగులో రిలీజ్ చేస్తారా?
‘గంధడ గుడి’ చిత్రాన్ని అక్టోబర్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీకి పునీత్ సతీమణి అశ్విని నిర్మాత కావడం గమనార్హం. కన్నడతోపాటు ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం విశేషం. తెలుగులోనూ డబ్బింగ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక సమాచారం లేదు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.