Movie Review: కిచ్చా సుదీప్‌ (Sudeep) నటించిన ‘K3: కోటికొక్కడు’.. మాస్ ఎంటర్‌‌టైనర్

Updated on Sep 16, 2022 09:21 PM IST
క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kiccha) తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. K3:కోటికొక్కడు సినిమా తెలుగులో రిలీజవుతోంది
క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kiccha) తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. K3:కోటికొక్కడు సినిమా తెలుగులో రిలీజవుతోంది

సినిమా : K3: కోటికొక్కడు

నటీనటులు : కిచ్చా సుదీప్, మడోన్నా సెబాస్టియన్, ఆఫ్తాబ్ శివదాసాని, శ్రద్ధాదాస్

మ్యూజిక్ : అర్జున్ జన్య

నిర్మాతలు : శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే

దర్శకత్వం: శివ కార్తీక్

విడుద‌ల‌ తేదీ : 16–09–2022

సినిమా రేటింగ్: 2.5 / 5

ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు కిచ్చా సుదీప్ (Sudeep). కన్నడ ఇండస్ట్రీలో టాప్‌ హీరోల్లో ఒకరిగా ఉన్నారాయన. సుదీప్ నటించిన K3 సినిమా రెండు భాగాలుగా రిలీజై మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. ఈ సినిమా సెకండ్ పార్ట్‌ను తెలుగులో విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తెలుగులో సరైన ప్రమోషన్లు చేయలేదని చిత్ర యూనిట్‌పై విమర్శలు వస్తున్నాయి.

K3 కోటిగబ్బ అనే పేరుతో కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాను K3 కోటికొక్కడు అనే టైటిల్‌తో తెలుగులోకి రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ ఏంటో తెలుసుకుందామా.. 

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kiccha) తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. K3:కోటికొక్కడు సినిమా తెలుగులో రిలీజవుతోంది

కథ ఏంటంటే:

K2 సినిమా తరహాలోనే సత్య తన కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించడంతో ‘K3 కోటికొక్కడు’ సినిమా మొదలవుతుంది. తాను చేసే మోసాలు, దోపిడీలను మరింతగా పెంచుతాడు సత్య. ఇంటర్‌‌పోల్‌ రాడార్‌‌లో వాంటెడ్‌ క్రిమినల్‌ అవుతాడు. ఇంటర్నేషనల్‌ స్థాయిలో వ్యాపారం చేసే దేవేంద్ర.. సత్య కారణంగా ఇబ్బంది పడతాడు.

దేవేంద్రకు సంబంధించిన క్యాష్‌, ఆర్నమెంట్స్‌, డాక్యుమెంట్లు, కంపెనీ రహస్యాలను దొంగతనం చేస్తాడు సత్య.  యొక్క నగదు, విలువైన వస్తువులు మరియు కంపెనీ రహస్యాలు అన్నింటిని దొంగిలిస్తాడు. అనంతరం ఇంటర్‌‌పోల్‌, దేవేంద్ర కలిసి సత్యను పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే సినిమా కథ. ముందుభాగంలో జరిగిన కథలో కొన్ని క్యారెక్టర్లు కూడా ఈ భాగంలోకి వచ్చి సత్యను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి.

ఎలా ఉందంటే..

కన్నడలో కిచ్చా సుదీప్‌ అభిమానులే టార్గెట్‌గా K3:కోటికొక్కడు సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కథ చాలా పాతది. అంతేకాకుండా ఈ సిరీస్‌లో ఇప్పటికే వచ్చిన సినిమాల తరహాలోనే ముగింపు కూడా ఉంటుంది. సినిమా చివరిలో వచ్చే ట్విస్ట్‌ అందరూ ఊహించినదే కావడంతో నిరాశ తప్పదు.ఈ సిరీస్‌లోని సినిమా సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించినట్టుగా మాత్రమే అనిపిస్తుంది. అంతకుమించి సినిమా కథలో గానీ, కథనంలోగానీ ఏ మాత్రం మార్పు కనిపించదు. 

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kiccha) తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నారు. K3:కోటికొక్కడు సినిమా తెలుగులో రిలీజవుతోంది

ఎవరు ఎలా నటించారంటే?

కిచ్చా సుదీప్‌ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించారు. అయితే ఆయన సామర్ధ్యానికి తగిన క్యారెక్టర్‌‌ కాదు. కేవలం గ్లామర్‌‌ కోసం మాత్రమే మడోన్నా సెబాస్టియన్ క్యారెక్టర్‌‌ను సినిమాలో పెట్టినట్టు అనిపిస్తుంది. మరో హీరోయిన్ శ్రద్దా దాస్‌ పాత్ర కూడా దాదాపుగా గ్లామర్‌‌ కోసమే అన్నట్టు ఉంటుంది. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న రవిశంకర్‌‌ పెర్ఫామెన్స్‌ ఓవర్‌‌గా ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఎందుకు అంత అతి చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంటర్‌‌పోల్‌ ఆఫీసర్‌‌గా అఫ్తాబ్ శివదాసాని తన పరిధి మేరకు నటించారు.  

సాంకేతికంగా కూడా ‘K3: కోటికొక్కడు’ సినిమా యావరేజ్‌గా ఉంది. ఫారిన్ లొకేషన్లలో తెరకెక్కించిన సన్నివేశాలు కూడా అంత ఆకర్షణీయంగా లేదు. ఇక అర్జున్‌ జన్య అందించిన సంగీతం అలరించలేదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం మాస్ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా మంచి బీట్స్ ఇచ్చారు అర్జున్‌.   

ప్లస్ పాయింట్లు :

కిచ్చా సుదీప్ (Sudeep) నటన

మైనస్‌ పాయింట్లు :

రొటీన్‌ కథ, సన్నివేశాలు

ఒక్క మాటలో.. అభిమానుల కోసం మాత్రమే ‘కోటికొక్కడు’

Read More : Vikrant Rona: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) పాన్‌ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!