కాంతార (Kantara) సినిమాలో ‘వరాహ రూపం’ సాంగ్ లిరిక్స్ మావే! కాపీ రైట్స్‌ ఉల్లంఘించారంటున్న ‘తైక్కుడం బ్రిడ్జ్‌’

Updated on Oct 27, 2022 04:01 PM IST
తెలుగులో విడుదలైన కాంతార (Kantara) సినిమా సూపర్‌‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది
తెలుగులో విడుదలైన కాంతార (Kantara) సినిమా సూపర్‌‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది

కాంతార (Kantara).. ఈ సినిమా పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి విజయం అందుకుందో .. తక్కువ బడ్జెట్‌లో వచ్చి సూపర్ హిట్అందుకున్న సినిమాగా కాంతారా సెన్సేషనల్ రికార్డును నెలకొల్పింది.

కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడలో రిలీజ్ అయింది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది .

విలేజ్ నేటివిటీకి దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ కావడంతో ప్రేక్షకులు కాంతార సినిమాను ఆదరించారు. ఈ క్రమంలో కన్నడ ప్రజలు సినిమాను విపరీతంగా ప్రమోట్ చేశారు. దీంతో ఈ సినిమా పేరు తెలుగు జనాల చెవిన పడింది.

తెలుగులో విడుదలైన కాంతార (Kantara) సినిమా సూపర్‌‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుని వసూళ్ల వర్షం కురిపిస్తోంది

లిరికల్ వీడియోతో సమస్యలు..

కాంతార సినిమాకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు అల్లు అరవింద్. రెండు కోట్లు ఖర్చు పెట్టి డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేశారు. తెలుగులోకి డబ్‌ చేసి అక్టోబర్‌‌ 15వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేశారు. కాంతార సినిమా అనూహ్యంగా సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీ, తమిళంలో కూడా విడుదలైన కాంతార సూపర్ హిట్ అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంగా ఉంది.

ఈ సమయంలో కాంతార చిత్ర యూనిట్‌కు షాక్ తగిలింది. బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన కాంతార సినిమాకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన వరాహ రూపం లిరికల్ వీడియో సాంగ్ వల్ల సమస్య ఏర్పడింది.

ఈ మ్యూజిక్ తమదేనని కన్నడకు చెందిన ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ 'తైక్కుడం బ్రిడ్జ్' వారు ఆరోపిస్తున్నారు. గతంలోనే ఈ బ్యాండ్‌ ఆధ్వర్యంలో 'నవరసం' ఆల్బమ్ వచ్చిందని తెలిపారు. దాన్ని కాపీ చేస్తూ 'కాంతార'లో బాగా పాపులర్ అయిన 'వరాహ రూపం' సాంగ్ ఉందని తైక్కుడం బ్రిడ్జ్​ ఫైర్ అయింది. ఇది పూర్తిగా కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని ఆరోపించింది. దీనికి సరైన జవాబు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకుంటే త్వరలోనే లీగల్‌ నోటీసులు పంపిస్తామని కాంతార (Kantara) చిత్ర యూనిట్‌ను హెచ్చరించింది.

Read More : ‘కాంతార’ (Kantara) సినిమా డైరెక్టర్‌‌పై మెగాపవర్‌‌స్టార్ రాంచరణ్‌ (Ram Charan) నజర్.. సినిమా తీయాలని ప్లాన్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!