థియేటర్‌లో విషాదం: ‘కాంతార’ (Kantara) సినిమా చూస్తూ కన్నుమూసిన ప్రేక్షకుడు! 

Updated on Oct 27, 2022 04:02 PM IST
‘కాంతార’ (Kantara) సినిమాను చూస్తున్న ఓ ప్రేక్షకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు
‘కాంతార’ (Kantara) సినిమాను చూస్తున్న ఓ ప్రేక్షకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు

కన్నడ మూవీ ‘కాంతార’ (Kantara) చిత్రం సంచలనాలు కొనసాగుతున్నాయి. కన్నడతోపాటు తెలుగు, హిందీల్లోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ రన్‌ను కొనసాగిస్తోంది. చిన్న సినిమాగా విడుదలైన ‘కాంతార’.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేస్తోంది. రిలీజైన 23 రోజుల్లో రూ.200 కోట్ల మార్కును ఈ మూవీ చేరుకుంది. కన్నడ నాట హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో మూడో ప్లేస్‌లో నిలిచింది. తద్వారా ‘కేజీఎఫ్​ 2’, ‘కేజీఎఫ్’ తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రంగా ‘కాంతార’ రికార్డు సృష్టించింది.

వ్యూస్ పరంగా హోంబాలే ప్రొడక్షన్స్ నిర్మించిన క్రితం సినిమాలు ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్​ 2’ను ‘కాంతార’ అధిగమించింది. హోంబాలే చిత్రాల్లో కన్నడ నాట ఎక్కువ వీక్షణ పొందిన చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. ఇక, తెలుగులోనూ ‘కాంతార’ ప్రభంజనం కొనసాగుతోంది. అక్టోబర్ 15న విడుదలైన ‘కాంతార’ తెలుగు వెర్షన్.. రిలీజ్ రోజే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత కూడా స్టడీ రన్‌ను కొనసాగిస్తూ.. పది రోజుల్లో రూ.27.60 కోట్ల గ్రాస్‌.. రూ.15.13 కోట్ల షేర్‌ను వసూలు చేసింది. 

తాజాగా ‘కాంతార’ సినిమా చూసి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకకు చెందిన రాజశేఖర్‌(45) అనే వ్యక్తి థియేటర్‌లో ఈ మూవీ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో థియేటర్‌ యాజమాన్యం వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించినప్పటికీ.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారని తెలుస్తోంది.  

ఇకపోతే, శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం నుంచి తాజాగా ‘వరాహ రూపం’ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో రిలీజైంది. భూతకోల నృత్య రూపకానికి సంబంధించిన లిరికల్, మేకింగ్‌ చూపిస్తూ ఈ వీడియో సాగింది. పాటలో సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను చూడొచ్చు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. 

Read more: రూ.25 కోట్ల క్లబ్‌లోకి ‘కాంతార’ (Kantara).. తెలుగులో కొనసాగుతున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) మూవీ ప్రభంజనం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!