'కాంతార' (Kantara) ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. సర్ ప్రైజ్ అమెజాన్ ప్రైమ్ (Amazon Prime).. నేటి నుంచే స్ట్రీమింగ్!

Updated on Nov 23, 2022 06:13 PM IST
'కాంతార' (Kantara OTT Release) సినిమా ఓటీటీ రిలీజ్‌ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. నవంబర్‌ 18న రిలీజ్ చేయాలని ముందు భావించారు.
'కాంతార' (Kantara OTT Release) సినిమా ఓటీటీ రిలీజ్‌ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. నవంబర్‌ 18న రిలీజ్ చేయాలని ముందు భావించారు.

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'కాంతార' (Kantara). కంటెంట్ ఉంటే కలెక్షన్లు వాటంతటవే వస్తాయనడానికి ఈ సినిమా ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఎలాంటి అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్ హడావిడీ లేకుండా తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార, రికార్డులు క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. 

ప్రకృతి-మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేసేలా రూ.16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400.90 కోట్ల వసూళ్లు చేసింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కాంతార సినిమాలో కర్ణాటక తుళునాడు సంస్కృతి, భూతకోల సంప్రదాయం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో రిషబ్ షెట్టి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. 

'కాంతార' (Kantara) మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూసిన ఓటీటీ ఫ్యాన్స్‌కు ప్రైమ్‌ వీడియో బుధవారం (నవంబర్‌ 23) గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా నవంబర్‌ 24న ఓటీటీలో రిలీజ్‌ కానున్నట్లు తెలిపింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా ప్రైమ్‌ వీడియోలోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్‌ వీడియో (Amazon Prime Video) తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.

ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడింది. నవంబర్‌ 18న రిలీజ్ చేయాలని ముందు భావించారు. అయితే సినిమా థియేటర్లలో ఇంకా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో వాయిదా వేశారు. నవంబర్‌ 24న కచ్చితంగా రానుందని అంచనా వేయగా.. ఇప్పుడు ప్రైమ్‌ వీడియోనే అధికారికంగా ప్రకటించడంతో నిరీక్షణకు తెరపడినట్లయింది.

‘‘మీ అందరి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ.. ‘కాంతార’ (Kantara) రేపు మీ ముందుకొస్తుంది’’ అని అమెజాన్ ప్రైమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

కర్ణాటకలో అయితే ‘కేజీఎఫ్‌ 2’ రికార్డును కూడా బ్రేక్‌ చేసింది ‘కాంతార’. కన్నడ నాట ఆల్‌టైమ్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. కాగా, సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన ఈ మూవీ తెలుగులో అక్టోబర్ 15న విడుదలైంది.  

Read More: పునీత్ రాజ్ కుమార్(Puneet Rajkumar): ‘కాంతార’(Kantara)లో ముందు అనుకున్న హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) కాదా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!