‘ధూమం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు కేజీఎఫ్ (KGF) మేకర్స్! హీరో ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే
కేజీఎఫ్ (KGF) సిరీస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీని సొంతం చేసుకున్నాయో అందరికీ తెలిసిందే. వాటిని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ (Hombale Films), దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే కేజీఎఫ్ సినిమాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కాకుండా పలు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించింది హోంబలే ఫిలిమ్స్.
తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును ప్రకటించింది హోంబలే సంస్థ. థూమం అనే సినిమాను తెరకెక్కించనున్నట్టు ప్రకటించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది. ఆ సినిమా తెచ్చిన క్రేజ్‌తో కేజీఎఫ్2ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు నిర్మాత విజయ్ కిరగందూర్.
అన్ని దక్షిణాది భాషల్లో..
పుష్ప, విక్రమ్ సినిమాలతో నటుడిగా మంచిపేరు తెచ్చుకున్నారు ఫహాద్ ఫాజిల్. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన బాగా చేరువయ్యారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలో కూడా ఫహాద్ ఫాజిల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. కేజీఎఫ్ వంటి ప్రతిష్టాత్మక సినిమాలను తెరకెక్కించిన హోంబలే సంస్ధ ‘ధూమం’ అనే టైటిల్‌తో సినిమా రూపొందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్నారు.
సమంత నటించిన యూ టర్న్ సినిమాకు దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ధూమం సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఫహద్ ఫాజిల్ సరసన అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటించనున్నారు. అక్టోబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ధూమం సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. సౌత్‌లోని అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. 2023 వేసవి కానుకగా ధూమం సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది హోంబలే ఫిలిమ్స్ (Hombale Films). కేజీఎఫ్ (KGF) సినిమాలతో కలిపి ఇప్పటివరకు ఏడు సినిమాలను నిర్మించి విడుదల చేసిన సంస్థ ప్రస్తుతం ఆరు సినిమాలను నిర్మిస్తోంది.
Read More : Pushpa Movie: “పుష్ప 3” కూడా ఉంటుంది.. ఫాహద్ ఫాజిల్ (Fahadh Faasil) సంచలన వ్యాఖ్యలు..!!