Banaras Movie Review : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో మరో సినిమా ‘బనారస్’..హీరోహీరోయిన్లకే ప్రయారిటీ

Updated on Nov 04, 2022 04:14 PM IST
కేజీఎఫ్, కాంతార సినిమాల కారణంగా వచ్చిన క్రేజ్‌తో కన్నడ సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు
కేజీఎఫ్, కాంతార సినిమాల కారణంగా వచ్చిన క్రేజ్‌తో కన్నడ సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు

టైటిల్‌ : బనారస్‌
నటీనటులు :  జైద్ ఖాన్, సోనాల్‌ మోంటెరో, సుజయ్ శాస్త్రి, దేవరాజ్

దర్శకత్వం : జయతీర్థ
సంగీతం :  బి. అజనీష్ లోక్‌నాథ్

నిర్మాత : తిలకరాజ్‌ బల్లార్‌
విడుదల తేది : నవంబర్‌ 4, 2022

రేటింగ్ : 3 / 5

కేజీఎఫ్, కాంతార సినిమాలకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌తో కన్నడ సినిమాలకు క్రేజ్ పెరిగింది. కన్నడ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి నిర్మాతలు కూడా పోటీ పడుతున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కన్నడ సినిమాలను తెలుగులోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు.  ఈ క్రమంలో బనారస్ సినిమా ఈ శుక్రవారం (నవంబర్‌‌ 4వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో  విడుదలైంది.

కథ ఏంటంటే?
సిద్దార్థ్‌ (జైద్‌ ఖాన్‌) బాగా డబ్బున్న వ్యక్తి. అతని తల్లి చిన్నప్పుడే మరణిస్తుంది. సిద్దార్ధ్‌ను తండ్రి గారాబంగా పెంచుతాడు. ఈ క్రమంలో ఫ్రెండ్స్‌తో పార్టీలు, ఔటింగ్స్ అంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు సిద్దార్థ్‌. ఒక పందెంలో నెగ్గడం కోసం ధని (సోనాల్‌ మోంటెరో)కి దగ్గరవుతాడు. టైమ్‌ ట్రావెల్‌లో భాగంగా భవిష్యత్తులో నుంచి ప్రస్తుత కాలానికి వచ్చానని.. ఫ్యూచర్‌‌లో మనిద్దరూ పెళ్లి చేసుకుంటామని, ఒక పాప పుడుతుందని చెప్తాడు. సిద్దార్థ్‌ చెప్పిన మాటలు నమ్మి అతడిని తన రూమ్‌కి తీసుకెళ్తుంది ధని. రూంలో ధని పడుకున్న టైంలో ఆమెతో క్లోజ్‌గా ఉన్నట్లు ఫోటో దిగి వెళ్లిపోతాడు సిద్దార్థ్‌.

మూడు రోజుల్లో ఆ మెను ప్రేమలో పడేయడమే కాకుండా.. ఆమె రూమ్‌కి కూడా వెళ్లానంటూ స్నేహితుల దగ్గర పందెం నెగ్గుతాడు. స్నేహితులు చేసిన పనితో ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. సింగింగ్‌ రియాల్టీ షోలో పాల్గొంటున్న ధని క్యారెక్టర్‌పై నెగెటివ్ కామెంట్స్‌ వస్తాయి. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్స్‌ అవమానాల కారణంగా ధని.. హైదరాబాద్‌ నుంచి బనారస్‌ (వారణాసి)కి వెళ్తుంది. చేసిన తప్పు తెలుసుకున్న సిద్దార్థ్‌ ఆమెకు క్షమాపణలు చెప్పడానికి బెనారాస్‌ వెళ్తాడు. ఆమె కోసం వెతుకుతున్న సమయంలో సిద్ధార్థ్‌ టైమ్‌ ట్రావెల్‌లో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సిద్దార్థ్‌ టైమ్‌ ట్రావెల్‌లో ఎలా ఇరుక్కున్నాడు?  చివరకు ధని, సిద్దార్థ్‌ ఎలా కలిశారు? అనేది మిగిలిన కథ. 

కేజీఎఫ్, కాంతార సినిమాల కారణంగా వచ్చిన క్రేజ్‌తో కన్నడ సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు

ఎలా ఉందంటే.. 
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ చిత్రం అదే జానర్‌లో తెరకెక్కినా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. లవ్‌స్టోరీ, ఫిలాసఫీ, ట్విస్ట్‌లతో ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. సినిమా స్టార్టింగ్‌లోనే టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను దర్శకుడు పరిచయం చేసినప్పటికీ.. కాసేపటికే సాధారణ ప్రేమ కథగా మారిపోతుంది. స్నేహితులు చేసిన తప్పుకు హీరోయిన్‌కు హీరో సారీ చెప్పడం, ఆమెతో నిజంగా ప్రేమలో పడడంతో ఫస్టాఫ్‌ రొటీన్‌గా జరిగిపోతుంది. ఈ క్రమంలో సాదాసీదాగా సాగుతున్న కథపై ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్‌ సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తుంది.

సెకండాఫ్‌లో కథ మలుపు తిరుగుతుంది. సిద్దార్థ్‌ టైమ్‌ లూప్‌లో పడిపోవడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకుడిని కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఇక కథ ముగింపుకు వచ్చింది అనుకునేలోపే మరో ట్విస్ట్‌ వస్తుంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో సెకండాఫ్‌ను అదిరిపోయేలా తీర్చిదిద్దారు దర్శకుడు. అయితే క్లైమాక్స్‌ రొటీన్‌గా ఉండడం కొంత నిరాశ కలిగిస్తుంది. 

ఎవరెలా నటించారంటే..
మొదటి సినిమా అయినా  జైద్‌ఖాన్‌ నటన బాగానే ఉంది. కొత్త యాక్టర్‌‌ను చూస్తున్నామనే భావన కలగదు. స్క్రీన్‌ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషన్‌ నిండిన క్యారెక్టర్‌‌కు హీరోయిన్‌ ధని న్యాయం చేసిందనే చెప్పాలి. కథ మొత్తం హీరోహీరోయిన్ల చుట్టూనే ప్రధానంగా తిరుగుతుండడంతో మిగిలిన క్యారెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఫోటోగ్రాఫర్‌‌ చెంబు క్యారెక్టర్‌‌ కామెడీ బాగానే ఉంది. హీరో తండ్రిగా దేవరాజ్, హీరోయిన్ బాబాయ్‌గా అచ్యుత్ కుమార్‌తోపాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.  కాశీ అందాలను తెరపై ఆకర్షణీయంగా చూపించారు దర్శకుడు. కాంతార ఫేమ్‌ మ్యూజిక్ డైరెక్టర్ బి.అజనీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం అందించారు.

ప్లస్ పాయింట్స్ : ట్విస్ట్‌లు, కథ

మైనస్‌ పాయింట్స్ : ఫస్టాఫ్, హీరోహీరోయిన్లకు తప్ప వేరే వాళ్లకు కథలో ఎక్కువ ప్రాధాన్యత లేకపోవడం

ఒక్క మాటలో.. హీరోహీరోయిన్ల కోసమే ‘బనారస్’

Read More : Special Story : అందం మాటున దాగిన అంతులేని బాధలు.. విధిని ఎదిరించిన నటీమణులు (Heroines)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!