‘కోటీగ‌బ్బా-3’ సినిమాని తెలుగులో ‘K3 కోటికొక్క‌డు’ పేరుతో రిలీజ్ చేస్తున్న 'కిచ్చా సుదీప్ (Sudeep Kiccha)' !

Updated on Aug 29, 2022 07:52 PM IST
కిచ్చా సుదీప్ (Sudeep Kiccha) నటించిన విక్రాంత్ రోణ చిత్రంలో తెలుగులో కూడా ఓపెనింగ్ కలెక్షన్లను బాగానే రాబట్టింది.
కిచ్చా సుదీప్ (Sudeep Kiccha) నటించిన విక్రాంత్ రోణ చిత్రంలో తెలుగులో కూడా ఓపెనింగ్ కలెక్షన్లను బాగానే రాబట్టింది.

క‌న్న‌డ స్టార్ హీరో సుదీప్ కిచ్చా (Sudeep Kiccha) తెలుగులో మార్కెట్‌ను పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. 'రక్త చరిత్ర' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుదీప్‌ కిచ్చా.. 'ఈగ' మూవీతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. 

ఇటీవలే సుదీప్ ‘విక్రాంత్ రోణ’ (Vikrant Rona) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాకుండా భారీ కలెక్షన్‌లు కూడా రాబట్టాడు. ఇక ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌తో హీరో సుదీప్ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. 

అయితే ఇప్పుడు తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు మరోసారి రెడీ అయ్యాడు ఈ కన్నడ హీరో. గ‌తేడాది క‌న్న‌డ‌లో విడుద‌లై బ్లాక్‌బాస్ట‌ర్‌ హిట్‌గా నిలిచిన ‘కోటీగ‌బ్బా-3’ (Kotigobba 3) చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో విడుద‌ల‌కు సిద్ధం చేశాడు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘K3 కోటికొక్క‌డు’ అనే టైటిల్‌తో మేక‌ర్స్ విడుద‌ల చేస్తున్నారు.  

ఆసక్తిని రేపే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ‘K3 కోటికొక్క‌డు’ (k3 Kotikokkadu) చిత్రం సెప్టెంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. నిజానికి ఈ సినిమా జూలైలోనే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే మేకర్స్ విక్రాంత్ రోణ ఫ‌లితం త‌ర్వాత, ఈ చిత్రాన్ని కొన్ని రోజులు ఆగి విడుద‌ల చేయాల‌ని భావించారు.

'విక్రాంత్ రోణ' తెలుగులో భారీ విజ‌యం సాధించిన సంగతి తెలిసిందే. రూ.1.25 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రుపుకున్న విక్రాంత్‌ రోణ ఫైన‌ల్‌గా సుమారుగా రూ.4 కోట్ల వ‌ర‌కు షేర్‌ను సాధించి బ్లాక్ బాస్ట‌ర్‌గా నిలిచింది. 

మడోన్నా సెబాస్టియన్ కథానాయికగా

ఈ క్ర‌మంలో 'K3' మేక‌ర్స్ ఇదే సరైన సమయం అని భావించి సినిమాను విడుద‌ల చేస్తున్నారు. శివ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సుదీప్‌కు జోడీగా మ‌డోన్నా సెబాస్టియ‌స్ హీరోయిన్‌గా న‌టించింది.

తెలుగులో ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ స‌మ‌ర్పిస్తోంది. రాంబాబు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై సూర‌ప్ప బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి ఈ సినిమాతో సుదీప్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Read More : 'విక్రాంత్ రోణ' తెర‌కెక్కించాలంటే ధైర్యం ఉండాలి : రాజ‌మౌళి (S. S. Rajamouli)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!