య‌శ్ (Yash) సినిమాలో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన బుట్ట‌బొమ్మ‌ (Pooja Hegde)!

Updated on Jun 15, 2022 06:08 PM IST
 కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 త‌ర్వాత య‌శ్ చేయ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే   (Pooja Hegde) న‌టిస్తున్నార‌ట‌
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 త‌ర్వాత య‌శ్ చేయ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే (Pooja Hegde) న‌టిస్తున్నార‌ట‌

టాప్ హీరోల‌తో హిట్ సినిమాల్లో న‌టించిన బ్యూటీ పూజ హెగ్డే (Pooja Hegde)కు మ‌రో పాన్ ఇండియా సినిమాలో అవ‌కాశం వ‌చ్చింది. కేజీఎఫ్ సినిమాల‌తో పాన్ ఇండియా హీరోగా మారిన య‌శ్‌తో పూజ హెగ్డే జ‌త‌క‌ట్ట‌నున్నారు. వ‌రుస ఫ్లాపుల్లో నిరాశ‌తో ఉన్న పూజ హెగ్డేకు మూవీ ఆఫ‌ర్స్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజ హెగ్డే న‌టించ‌నున్నారు. 

పూజాతో కూడా యాక్ష‌న్ సీన్సా!
జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో పూజ హెగ్డే (Pooja Hegde) కూడా యాక్ష‌న్  పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని టాక్. విజ‌య్, పూజ ఆర్మీ సైనికులుగా క‌నిపించ‌నున్నార‌ట‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌గ‌ణ‌మ‌న తెర‌కెక్కుతుంది.

ప్ర‌పంచ సినిమా వేడుకలు కేన్స్ ఫిలిమ్ ఫెస్టిఫ‌ల్‌కు భార‌తీయ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హరించారు. ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌తో పూజ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లు హీరోల‌తో న‌టిస్తున్నారు. బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ సినిమా స‌ర్క‌స్‌, స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న‌క‌బీ ఈద్ క‌బీ దివాళి సినిమాల్లో పూజా హీరోయిన్‌గా చేస్తున్నారు. 

టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ బాబుతో మ‌హ‌ర్షి సినిమాలో హీరోయిన్‌గా న‌టించి  మంచి పేరు తెచ్చుకున్నారు పూజ హెగ్డే. ప్ర‌స్తుతం తివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబుకు జోడిగా పూజా మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. 

పూజ హెగ్డే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో ఛాన్స్‌ను మిస్ చేసుకుంద‌నే వార్త‌లు వినిపించాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌బోయే భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ సినిమాలో పూజ హీరోయిన్‌గా చేయాల‌నుకున్నారు. అయితే ఆ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. దీంతో పూజ హెగ్డే జ‌గ‌గ‌ణ‌మ‌న ప్రాజెక్టుకు ఓకే చెప్పార‌ట‌. 

 

 కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 త‌ర్వాత య‌శ్ చేయ‌బోయే సినిమాలో హీరోయిన్‌గా పూజ హెగ్డే  (Pooja Hegde) న‌టిస్తున్నార‌ట‌

య‌శ్‌కు జోడిగా పూజ‌
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2తో హీరో య‌శ్‌కు ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది. త్వ‌ర‌లో య‌శ్ సినిమా వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు. పాన్ ఇండియా సినిమాలో య‌శ్ న‌టిస్తున్నార‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక య‌శ్ కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 త‌ర్వాత చేయ‌బోయే సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్నార‌ట‌. య‌శ్ త‌న 19 వ సినిమాను న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నారు. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్ సంస్థ య‌శ్ సినిమాను నిర్మిస్తుంది. పూజ హెగ్డేకు య‌శ్ సినిమా క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పార‌ట‌. ఇక య‌శ్ ప‌క్క‌న బుట్ట‌బొమ్మ ఏ రేంజ్‌లో అద‌ర‌గొట్ట‌నుందో చూడాలి. 

Read More : Jana Gana Mana: జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మొద‌లు పెట్టిన పూరి జ‌గన్నాథ్.. రౌడీ హీరో (Vijay Deverakonda) ఎక్క‌డ అంటున్న ఫ్యాన్స్‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!