Jana Gana Mana: జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మొద‌లు పెట్టిన పూరి జ‌గన్నాథ్.. రౌడీ హీరో (Vijay Deverakonda) ఎక్క‌డ అంటున్న ఫ్యాన్స్‌

Updated on Jun 05, 2022 02:54 PM IST
Jana Gana Mana: జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మే 4న ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో విజ‌య్‌కు జోడిగా పూజ హెగ్డే (Pooja Hegde) న‌టిస్తున్నారు.
Jana Gana Mana: జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మే 4న ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో విజ‌య్‌కు జోడిగా పూజ హెగ్డే (Pooja Hegde) న‌టిస్తున్నారు.

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ల‌వ‌ర్ బాయ్‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ప్ర‌స్తుతం యాక్ష‌న్ చిత్రాల‌తో త‌న స‌త్తా ఏంటో చూపిస్తానంటున్నారు రౌడీ హీరో. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) లైగ‌ర్, జ‌న‌గ‌ణ‌మన (JGM) సినిమాల‌ను చేస్తున్నారు. విజ‌య్ హీరోగా చేస్తున్న‌ రెండు సినిమాల‌ను పాన్ ఇండియా సినిమాలుగా పూరి తెర‌కెక్కిస్తున్నారు. జ‌న‌గ‌ణ‌మ‌న షూటింగ్ మే 4న ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో విజ‌య్‌కు జోడిగా పూజ హెగ్డే (Pooja Hegde) న‌టిస్తున్నారు. జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాకు సంబంధించి ముంబైలో జ‌రిగిన‌ పూజా కార్య‌క్రామాల‌లో పూరి అండ్ టీం పాల్గొన్నారు. 

జ‌న‌గ‌ణ‌మ‌న ఆరంభం
స్టాట్.. కెమెరా.. యాక్ష‌న్ అంటూ జ‌న‌గ‌ణ‌మ‌న‌ (JGM) మూవీ షూటింగ్ స్టాట్ చేశారు పూరి జ‌గ‌న్నాథ్. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమా చేస్తూనే జ‌న‌గ‌ణ‌మ‌న అనే టైటిల్ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లారు. విజ‌య్ దేవ‌రకొండతో మొద‌టి సారి పూజ హెగ్డే జోడి క‌ట్ట‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా వ‌స్తున్న జేజీఎం సినిమాను  పూరి క‌నెక్ట్స్, శ్రీక‌ర స్టూడీయోస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్నారు. నిర్మాత‌లుగా చార్మీకౌర్, వంశీ పైడిప‌ల్లి, పూరి జ‌గ‌న్నాథ్‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో ఈ సినిమాను 2023 ఆగ‌స్టు 3 న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

 

Jana Gana Mana: పూరి జ‌గ‌న్నాథ్ విజ‌య్ దేవ‌ర‌కొండ జ‌న‌గ‌ణ‌మ‌న పోస్ట‌ర్ల‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వాల‌ని చూస్తున్నారేమో?

రౌడీ హీరో ఎక్క‌డా? - విజ‌య్ ఫ్యాన్స్
విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)  జ‌న‌గ‌ణ‌మ‌న సినిమాలో ఆర్మీ అధికారిగా సీరియ‌స్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ ముంబైలో జ‌రిగిన జ‌న‌గ‌ణ‌మ‌న పూజ కార్య‌క్రమానికి హాజ‌రు కాక‌పోవ‌డం అభిమానులను నిరాశ ప‌రిచింది. అయితే పూరీ ప్లాన్ ఏంటో.. ప్ర‌మోష‌న్ల వ్య‌వ‌హారం ఏంటో తెలియాల్సి ఉంది. ఎందుకంటే విజ‌య్ దేవ‌ర‌కొండ జ‌న‌గ‌ణ‌మ‌న పోస్ట‌ర్ల‌తో ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వాల‌ని చూస్తున్నారేమో?. ఓ రేంజ్‌లో అప్‌డేట్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తుంది. ఇక విజ‌య్ దేవ‌రకొండ సినిమా జ‌న‌గ‌ణ‌మ‌న నుంచి వ‌రుస అప్‌డేట్స్ రిలీజ్ కానున్నాయి. లైగ‌ర్ చిత్రంలో మైక్ టైస‌న్ లైగ‌ర్‌లో విజ‌య్ తండ్రి పాత్ర‌లో న‌టిస్తున్నారు. బాక్సర్ పాత్ర‌లో విజ‌య్ ఇచ్చే కిక్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాలో అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో లైగ‌ర్ 2022 ఆగ‌స్టు 25న రిలీజ్ కానుంది.

పూజాతో కూడా యాక్ష‌న్ సీన్సా!
పూజ హెగ్డే (Pooja Hegde) కూడా యాక్ష‌న్  పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని టాక్. అంటే ఆర్మీ ఆఫీస‌ర్‌గా పూజా హెగ్డే కూడా న‌టించ‌నున్నారేమో! పూజ హెగ్డే న‌టించిన రీసెంట్ సినిమాలు బీస్ట్,  ఆచార్య ఫ్లాప్ అయ్యాయి. కానీ పూజ ఇమేజ్‌మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్ర‌పంచ సినిమా వేడుకలు కేన్స్ ఫిలిమ్ ఫెస్టిఫ‌ల్‌కు భార‌తీయ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హరించారు. ప్ర‌స్తుతం ఫుల్ జోష్‌తో పూజ వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లు హీరోల‌తో న‌టిస్తున్నారు. బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ సినిమా స‌ర్క‌స్‌, స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న‌క‌బీ ఈద్ క‌బీ దివాళి సినిమాల్లో పూజా హీరోయిన్‌గా చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరో మ‌హేష్ బాబుతో మ‌హ‌ర్షి సినిమాలో హీరోయిన్‌గా న‌టించి  మంచి పేరు తెచ్చుకున్నారు పూజ హెగ్డే. ప్ర‌స్తుతం తివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబుకు జోడిగా పూజా మ‌రో సినిమాలో న‌టిస్తున్నారు. 

Read More: https://telugu.pinkvilla.com/entertainment/vijay-devarakonda-and-samantha-not-injured-in-kushi-movie-shooting-it-is-fake-news-said-shivanirvana-799
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!