Ponniyin Selvan 1: పౌరాణిక చిత్రాలు తీయాలంటే తెలుగోడే తీయాలి.. తమిళ, తెలుగు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్

Updated on Oct 06, 2022 11:48 PM IST
(Ponniyin Selvan 1) ‘పొన్నియిన్ సెల్వన్’పై టాలీవుడ్ లో నెగెటివ్ టాక్.. తెలుగు ఫ్యాన్స్‌పై మండిపడుతున్న తమిళులు
(Ponniyin Selvan 1) ‘పొన్నియిన్ సెల్వన్’పై టాలీవుడ్ లో నెగెటివ్ టాక్.. తెలుగు ఫ్యాన్స్‌పై మండిపడుతున్న తమిళులు

ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవల గురించి వింటూనే ఉన్నాం. తమ హీరో గొప్పంటే, తమ హీరో గొప్పంటూ అభిమానులు కొట్టుకోవడం షరా మామూలే. కానీ రెండు చిత్ర పరిశ్రమల అభిమానుల మధ్య వార్ జరగడం గురించి ఎక్కువగా వినుండరు. సోషల్ మీడియా వేదికగా తెలుగు, తమిళ సినీ అభిమానులు తమ ఫిల్మ్ ఇండస్ట్రీనే గొప్పదంటూ కామెంట్లతో కత్తులు దూసుకుంటున్నారు. అసలు ఈ వార్‌కు సంబంధించిన కారణాలేంటో తెలుసుకుందాం.. 

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరిగా పేరొందిన మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) చిత్రం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే ‘పొన్నియిన్ సెల్వన్’కు మిశ్రమ స్పందన లభించింది. తమిళంలో మంచి టాక్ దక్కినా.. తెలుగుతోపాటు ఉత్తరాదిన మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చేసింది. 

తమిళ చిత్రసీమకు ‘పొన్నియిన్ సెల్వన్’ మరింత గౌరవాన్ని తీసుకొస్తుందని అక్కడి అభిమానులు నమ్మకాన్ని పెట్టుకున్నారు. చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan 1) ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం.. తమిళ ‘బాహుబలి అవుతుందని వాళ్లు ఆశించారు. కానీ అనూహ్యంగా చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సినిమా బాగోలేదంటూ సోషల్ మీడియాలో తెలుగు ప్రేక్షకులు పెడుతున్న పోస్టులు, కామెంట్లతో కొందరు తమిళ సినీ అభిమానులు గరంగరం అవుతున్నారు. 

పౌరాణిక చిత్రాలు తీయాలంటే కేవలం ఎస్.ఎస్ రాజమౌళి లాంటి తెలుగు దర్శకులకే సాధ్యమని తెలుగు ఫ్యాన్స్ పెట్టిన పోస్టులకు తమిళ అభిమానులు హర్ట్ అయ్యారు. దీంతో తెలుగు ప్రేక్షకులపై తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు. జక్కన్న తీసిన బాహుబలి ఒక ఫిక్షనల్ మూవీ అని.. ‘పొన్నియిన్ సెల్వన్’ యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని వారు విరుచుకుపడుతున్నారు. తెలుగువారికి సినిమాలను ఎలా చూడాలో తెలియదని.. వారికి సరైన్ టేస్ట్ లేదంటూ రెచ్చగొట్టేలా కామెంట్లు చేస్తున్నారు తమిళ ఫ్యాన్స్. నెక్స్ట్ తమిళంలోకి ఏదైనా తెలుగు సినిమాను డబ్ చేసి, రిలీజ్ చేస్తే అప్పుడు తమ సత్తా చూపిస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి తెలుగు ప్రేక్షకులు కూడా ఘాటుగా బదులిస్తున్నారు. 

తమిళంలోకి డబ్ అయ్యే తెలుగు సినిమాలు పెద్దగా ఉండవనీ, తమకు పోయేదేమీ లేదని తెలుగు ఫ్యాన్స్ అంటున్నారు. తెలుగులోకి డబ్ అయ్యే తమిళ చిత్రాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. తాము తలచుకుంటే తమిళ పెద్ద హీరోల సినిమాల పరిస్థితి ఏంటో ఊహించుకోవాలని చాలెంజ్ విసురుతున్నారు. భాషలతో సంబంధం లేకుండా మంచి చిత్రాలను తాము ఆదరిస్తామని.. మణిరత్నంపై ఉన్న అభిమానంతో ‘పొన్నియిన్ సెల్వన్’ను అనేకమంది తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారని పేర్కొంటున్నారు. మరి, ఈ సోషల్ మీడియా వార్‌కు ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి. 

Read more: 'పొన్నియిన్ సెల్వ‌న్' లాంటి క‌థ‌లు అనేకం.. భార‌త‌దేశ చ‌రిత్ర గొప్ప‌ది - చియాన్ విక్ర‌మ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!