Pakka Commercial Trailer ( పక్కా కమర్షియల్) : మీతో సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరో కాదురా.. విలన్ !

Updated on Jun 12, 2022 07:31 PM IST
పక్కా కమర్షియల్ మూవీ పోస్టర్స్ (Pakka Commercial Movie Posters)
పక్కా కమర్షియల్ మూవీ పోస్టర్స్ (Pakka Commercial Movie Posters)

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా నటించిన తాజా మూవీ 'పక్కా కమర్షియల్' (Pakka Commercial). అందాల బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. జీఏ2, యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ట్రైలర్‌ని  విడుదల చేశారు. 

ఆసక్తి సాగిన పక్కా కమర్షియల్‌ ట్రైలర్

తాజాగా ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో, సోషల్‌ మీడియాలో దూసుకుపోతూ.. ట్రెండింగ్‌ అవుతోంది. ఇందులో డైలాగ్‌లు, ఫన్నీ సీన్లు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ (Pakka Commercial Teaser), మూవీ గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ చిత్రం జులై 1 న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇందులో భాగంగానే.. సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. లాయర్‌గా గోపీచంద్ డైలాగ్స్ మూవీ పై ఆసక్తిని పెంచుతున్నాయి. కోర్టు నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) హీరోగా వచ్చిన 'ప్ర‌తిరోజు పండ‌గే' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా 'పక్కా కమర్షియల్'. ‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ట్రైలర్ అంతా పక్కా కమర్షియల్ కోణంలో ఉంది. రాశీ ఖన్నా డైలాగ్స్ కూడా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

'క్యారెక్టర్‌ని చంపేశారని కోర్ట్ కెక్కావా?' అని జడ్జ్ చెప్పడం,'క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావ్‌, మన పాలిట దేవుళ్లు' అని గోపీచంద్  చెప్పడం, 'యుద్ధం ఆరంభం అయ్యింది' అని రాశీఖన్నా చెప్పే డైలాగ్‌, 'కేజీఎఫ్‌ 1, 2, 3 చాలదు.. డైరెక్ట్‌ గా 10' కావాల్సిందే అని సత్య చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 

గోపీచంద్‌ సినిమా పై భారీ అంచనాలు 

గోపీచంద్ (Gopichand) ఈ సినిమాలో తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత కొత్తగా, చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సత్యరాజ్, రావు రమేష్ పాత్రలు విభిన్నంగా డిజైన్ చేసారు డైరెక్టర్ మారుతి. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మూసాపేట్‌లోని ఏసియన్ సినిమాస్‌లో జరిగిన ట్రైలర్ లాంఛ్ (Pakka Commercial Trailer Launch) ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా  ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Read More: నా కండీష‌న్సే.. నీ కిష్ట‌మైతే.. ఇంకా వ‌చ్చేయి అంటున్న గోపిచంద్ (Gopichand)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!