మహేష్‌బాబు (MaheshBabu) ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై ప్రకాష్‌రాజ్‌ కామెంట్లు

Updated on Jul 19, 2022 01:15 AM IST
ప్రకాష్‌రాజ్, మహేష్‌బాబు (MaheshBabu)
ప్రకాష్‌రాజ్, మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) టాలీవుడ్ ప్రిన్స్‌గా అందరికీ సుపరిచితుడే. ఆయన సినిమాలో నటించే అవకాశం కోసం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లే కాదు.. సీనియర్లు కూడా కోరుకుంటారు. నటించే చాన్స్ వస్తే వదులుకోరు కూడా.

ఇక, ప్రకాష్‌రాజ్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి ఆ క్యారెక్టర్‌‌కు ప్రాణం పోసేలా నటిస్తారాయన. ప్రకాష్‌రాజ్‌ నటన నచ్చని వాళ్లు ఉండరని చెప్పడం అతిశయోక్తి కాదు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రకాష్‌ రాజ్.

ఇక, మహేష్‌బాబు కెరీర్‌‌లో సూపర్‌‌హిట్‌ అయిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ప్రకాష్‌రాజ్ నటించారు. పలు సినిమాలను మినహాయిస్తే మహేష్‌బాబు సినిమాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించారు ప్రకాష్‌రాజ్. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రకాష్‌రాజ్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మహేష్‌బాబు సినిమాలో చేసిన క్యారెక్టర్‌‌ తనకు నచ్చలేదని, అయినా ఆ సినిమాలో నటించానని కామెంట్లు చేశారు ప్రకాష్‌రాజ్. ఆ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

ప్రకాష్‌రాజ్, మహేష్‌బాబు (MaheshBabu)

అయిష్టంగానే నటించా..

ఏ ఆర్టిస్టుకైనా ఒక్కోసారి నచ్చని క్యారెక్టర్లు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పాత్రల్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన పాత్ర ఒకటి. ఆ సినిమాలో అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకుడి క్యారెక్టర్‌‌లో నటించాను. ఆ క్యారెక్టర్‌‌ నాకు నచ్చలేదు. ఇష్టం లేకుండానే ఆ పాత్రలో నటించాను. నటులకు కొన్ని సార్లు వారి నిర్ణయాలు.. అభిప్రాయాలతో పని లేకుండా అలా జరుగుతుంది అని చెప్పుకొచ్చారు ప్రకాష్‌రాజ్.

కాగా మహేశ్ బాబు (MaheshBabu) హీరోగా చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో తాను అటువంటి క్యారెక్టర్‌‌ చేయడం అసంతృప్తిగా అనిపించినా, ఆయన నిర్మించిన 'మేజర్' సినిమాలోని క్యారెక్టర్‌‌ తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు ప్రకాష్‌రాజ్. తన కెరీర్‌‌లో 'ఆకాశమంత', 'బొమ్మరిల్లు' సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు తనకు చాలా సంతోషాన్ని ఇచ్చాయని చెప్పుకొచ్చారు ప్రకాష్‌రాజ్. సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.

 Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!