‘పుష్ప 2’ సినిమాలో మరో హీరోయిన్!.. నెగెటివ్ పాత్రలో కనిపించనున్న కేథరిన్ ట్రెసా?

Updated on Nov 22, 2022 05:02 PM IST
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన మహిళా పోలీసు అధికారి రోల్‌లో కేథరిన్ (Catherine Tresa) కనిపించనున్నారని సమాచారం
‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రంలో నెగెటివ్ షేడ్స్ కలిగిన మహిళా పోలీసు అధికారి రోల్‌లో కేథరిన్ (Catherine Tresa) కనిపించనున్నారని సమాచారం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), డాషింగ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కావడంతో, అందుకు తగినట్లుగా మరిన్ని పాత్రలు ఈ కథలో వచ్చి చేరుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ లాంటి వారి పేర్లు వినిపించాయి. 

ఇప్పుడు స్టార్ హీరోయిన్ కేథరిన్ ట్రెసా (Catherine Tresa) పేరు తెరపైకి వచ్చింది. ‘పుష్ప 2’ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆమెను సుకుమార్ ఎంపిక చేశారని సమాచారం. నెగెటివ్ షేడ్స్ కలిగిన మహిళా పోలీసు అధికారి క్యారెక్టర్‌లో కేథరిన్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ‘పుష్ప’ అంతు చూస్తానంటూ ఆ అడవిలోకి ఆమె ఎంట్రీ ఇస్తారని కూడా చెబుతున్నారు. కేథరిన్ బాడీ లాంగ్వేజ్ కూడా వైవిధ్యంగా డిజైన్ చేశారని సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. 

నెగెటివ్ షేడ్స్ కలిగిన మహిళా పోలీసు అధికారి క్యారెక్టర్‌లో కేథరిన్ కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి

బన్నీతో కేథరిన్ ఇదివరకే రెండు చిత్రాల్లో నటించారు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’ సినిమాల్లో వీళ్లిద్దరూ జంటగా కనిపించి అలరించారు. ఇక ఇప్పుడు ‘పుష్ప 2’ మూవీ కోసం కేథరిన్‌ను రంగంలోకి దింపనున్నట్లుగా తెలుస్తోంది. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ‘పుష్ప’ సీక్వెల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.  

ఇకపోతే, ‘పుష్ప 2’ సినిమాకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా మేకర్స్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సీక్వెల్‌పై భారీ క్రేజ్ ఉంది. కాబట్టి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం అంత కష్టం కాకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ రిలీజయ్యే స్క్రీన్లలో ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి, ఈ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటో చూడాలి. 

Read more: విజువల్ వండర్‌గా ‘హనుమాన్’ (HanuMan) టీజర్.. ‘ఆదిపురుష్’ (Adipurush) డైరెక్టర్ ఓం రౌత్‌పై నెటిజన్స్ ట్రోల్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!