ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ సినిమాను ఎన్ని భాషల్లో తెరకెక్కించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటే?

Updated on Aug 30, 2022 06:23 PM IST
ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ సూపర్‌‌ హిట్‌ అయ్యింది
ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ సూపర్‌‌ హిట్‌ అయ్యింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ (Junior NTR)  తర్వాత సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు తార‌క్. ప్రస్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఆ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ కూడా వచ్చేసింది.

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు రావడమే కాదు. ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్‌‌ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్‌ సినిమా గురించి ఎప్పుడు ఏ అప్‌డేట్ వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

‘ఆచార్య’ సినిమా ఫలితంతో సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారు కొరటాల. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాతో ఎన్టీఆర్‌‌ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్టీఆర్‌‌ నుంచి ఏ సినిమా వచ్చినా అదే రేంజ్‌లో ఉండాలని అనుకుంటుంటారు అభిమానులు. అందుకు తగినట్టుగా సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నారని టాక్. అంతేకాదు ఈసారి స్క్రిప్ట్‌ను పాన్‌ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తయారుచేస్తున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌ సూపర్‌‌ హిట్‌ అయ్యింది

రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌‌ నుంచే..

వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌‌30ను 9 భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న స‌మాచారం ప్రకారం న‌వంబ‌ర్ నుంచి ఈ సినిమా షూటింగ్‌ సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట మేకర్స్.

ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్నారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించార‌ట‌. ఈ గ్యాప్‌లోనే ఫిట్‌నెస్ విష‌యంలో కూడా తారక్‌ కేర్ తీసుకుంటున్నార‌ని సమాచారం. ఈ సినిమాలో తార‌క్ స్టూడెంట్ లీడ‌ర్ క్యారెక్టర్‌‌ చేయనున్నారని తెలుస్తోంది. జ‌న‌తా గ్యారేజ్ వంటి సూప‌ర్ హిట్ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్‌ (Junior NTR), కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెరకెక్కనుంది ఈ సినిమా.

Read More : ఎన్టీఆర్‌‌ (Junior NTR), ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పటి నుంచంటే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!