స్పోర్ట్స్ డ్రామాగా జూనియర్‌‌ ఎన్టీఆర్ (Junior NTR)-బుచ్చి బాబు కాంబినేషన్ మూవీ.. ద్విపాత్రాభినయంలో తారక్?

Updated on Sep 03, 2022 12:07 PM IST
బుచ్చిబాబు (Director Buchi Babu) వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాడట.
బుచ్చిబాబు (Director Buchi Babu) వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఎన్టీఆర్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాడట.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ విజయం తర్వాత మాంచి జోష్‌ మీద ఉన్నారు జూనియర్‌‌ ఎన్టీఆర్ (Junior NTR). క్రేజీ దర్శకులతో వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ, ఇంకా ఏ సినిమానూ స్టార్ట్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.. ఈనెలలో స్టార్ అవుతుంది.. వచ్చే నెలలో మొదలవుతుంది.. అంటూనే నెలలు గడిచిపోతున్నాయి తప్ప, ప్రాజెక్ట్ మాత్రం సెట్స్ మీదకు వెళ్లడంలేదు.

2015లో వచ్చిన 'టెంపర్' (Temper Movie) సినిమా తర్వాత ఈ హీరోకు ఎదురే లేకుండా పోయింది. ఈ సినిమాకి ముందు వరుస ప్లాపులతో ఇబ్బంది పడిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కథల విషయంలో చాలా క్లారిటీగా ఉన్నాడు. కథ నచ్చకపోతే ఏ దర్శకుడికైనా మొహం మీదే వద్దు అని చెప్పేస్తున్నాడు. అందుకే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత, ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి వరుస విజయాలు తారక్ ఖాతాలో చేరిపోయాయి.

అయితే, తారక్ ప్రస్తుతం ప్రస్తుతం కొరటాల శివ (Koratal Siva) దర్శకత్వంలో, ఆ తర్వాత కేజీఎఫ్ (KGF) దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాలతో అలరించనున్నారు. మరోవైపు 'ఉప్పెన' సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఎన్టీఆర్ తదుపరి సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ దీనికి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 

బుచ్చిబాబు (Director Buchi Babu) వీలైనంత త్వరగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాడట. ఆయన రాసుకున్న కథలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి 65 ఏళ్ల వృద్ధుడి పాత్ర అయితే.. మరొకటి 30 ఏళ్ల యువకుడి పాత్ర. పైగా ఆ వృద్ధుడి పాత్రకు ఒక లోపం పెట్టి.. వీల్ చైర్ కు పరిమితం చేస్తున్నాడు బుచ్చిబాబు సన. కాగా, ఇది పూర్తిగా కబడ్డీ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. 

అయితే, ఈ వార్త వైరల్ అయ్యే సరికి.. ఎన్టీఆర్ ష్యాన్స్ (NTR Fans) షాక్ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ గా రేంజ్ పెంచుకునే క్రమంలో ఉన్న ఎన్టీఆర్ కు ఈ రిస్క్ అవసరమా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ‘ఆంధ్రావాలా’ సినిమాలో ఇలానే ఎన్టీఆర్… యంగ్, ఓల్డ్ క్యారెక్టర్స్ చేశారు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ అలాంటి రిజల్ట్ రిపీటవుతుందేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

Read More: Shruti Haasan: 'ప్రశాంత్ నీల్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు'.. సలార్ హీరో, దర్శకుడిపై శృతి హాసన్ వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!