'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన చిరంజీవి (Chiranjeevi).

Updated on Jul 21, 2022 04:37 PM IST
 మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య  (Naga Chaitanya) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమాలో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) కీల‌క పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు. అమీర్‌ఖాన్, క‌రీనా క‌పూర్ 'లాల్ సింగ్ చ‌డ్డా'లో హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ నాగ‌చైత‌న్య పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య సైనికుడు బాల‌రాజుగా న‌టించారు. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' ఆగ‌స్టు 11న విడుద‌ల కానుంది. 

చై పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన చిరు
'లాల్ సింగ్ చ‌డ్డా'లో నాగ‌చైత‌న్య (Naga Chaitanya) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిరంజీవి రిలీజ్ చేశారు. 'లాల్ సింగ్ చడ్డా'లో చెడ్డీ బ‌డ్డీ బాల‌రాజును ప‌రిచయం చేస్తున్నానంటూ చిరంజీవి పోస్ట్ చేశారు. అలనాటి 'బాలరాజు' మనవడు మన అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరాజుని తెలిపారు. చిరంజీవి విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య ఆర్మీ అధికారి బాల‌రాజుగా క‌నిపించారు. చిరంజీవి స‌మ‌ర్ప‌ణ‌లో 'లాల్ సింగ్ చ‌డ్డా' సినిమా రిలీజ్ కానుంది. ‘రుద్ర‌వీణ‌’, ‘త్రినేత్రుడు’ త‌ర్వాత చిరు నాగ‌చైత‌న్య‌, అమీర్‌ఖాన్‌ల సినిమాను స‌మ‌ర్పించ‌డం విశేషం. 
 

క‌రీనా లుక్ అదుర్స్
Laal Singh Chaddha: బాలీవుడ్ దివా కరీనా కపూర్ 'లాల్ సింగ్ చ‌డ్డా'లో రూప పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో రీసెంట్‌గా పోస్ట్ చేశారు. ''‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని  మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని తెలిపారు.

ప్ర‌స్తుతం క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లాల్ సింగ్ చ‌డ్డా హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ కానుంది. వ‌యాకామ్ 18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read More: Aamir Khan & Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కోసం అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) ప్రివ్యూ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!