మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ సినిమా ట్రైలర్‌‌ విడుదల.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే!

Updated on Sep 28, 2022 11:31 AM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం సాయంత్రం నుంచి అనంతపురంలో జరగనుంది
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం సాయంత్రం నుంచి అనంతపురంలో జరగనుంది

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. గాడ్‌ఫాదర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే నెలకొన్నాయి. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన గాడ్‌ఫాదర్‌‌ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కింది. మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన లూసిఫర్‌‌ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ రూపొందింది.

అక్టోబర్‌‌ 5వ తేదీన విజయ దశమి సందర్భంగా గాడ్‌ఫాదర్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది చిత్ర యూనిట్. ఇటీవలే గాడ్‌ఫాదర్ సినిమాలో సల్మాన్‌ఖాన్‌తో కలిసి చిరు స్టెప్స్‌ వేసిన ‘తార్‌‌మార్ తక్కర్‌‌ మార్’ పాటను విడుదల చేసి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఒక్కరోజు ముందు గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్‌‌ను ఎలివేట్‌ చేసేలా తెరకెక్కించిన పాటలను విడుదల చేసింది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ బుధవారం సాయంత్రం నుంచి అనంతపురంలో జరగనుంది

ఆశలన్నీ ఈ సినిమాపైనే..

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్‌‌ స్టార్‌‌ రాంచరణ్ నటించిన ఆచార్య సినిమా ఫలితం నిరాశపరచడంతో మెగా అభిమానుల ఆశలన్నీ గాడ్‌ఫాదర్‌‌పైనే పెట్టుకున్నారు. పొలిటికల్ యాక్షన్‌ జానర్‌‌ సినిమా కావడంతో హీరోయిన్‌ లేకుండానే చిరంజీవి నటించారు. చిరు సాల్ట్‌ అండ్ పెప్పర్‌‌ లుక్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. తాజాగా గాడ్‌ఫాదర్‌‌ సినిమా నుంచి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది.

 గాడ్‌ఫాదర్ సినిమా ట్రైలర్‌‌ను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది చిత్ర యూనిట్. బుధవారం సాయంత్రం అనంతపూర్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే ట్రైలర్‌‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. బుధవారం రాత్రి 8 గంటలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా ట్రైలర్‌‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌‌ ఎస్‌ఎస్‌ థమన్‌ కాన్సర్ట్‌తో గ్రాండ్‌గా నిర్వహించనున్నారని టాక్.

Read More : చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (GodFather) నుంచి ‘గజగజవణికించే గజరాజడిగోరా’ సాంగ్‌ రిలీజ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!