చిరంజీవి (Chiranjeevi) ‘గాడ్‌ఫాదర్’ (GodFather) నుంచి ‘గజగజవణికించే గజరాజడిగోరా’ సాంగ్‌ రిలీజ్

Updated on Sep 27, 2022 05:32 PM IST
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా న‌టించిన సినిమా 'గాడ్‌ఫాద‌ర్' (GodFather). దసరా కానుకగా అక్టోబర్‌‌ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ స్టార్‌‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్‌‌ తెరకెక్కింది. ఈ సినిమాకు మోహన్‌రాజా దర్శకత్వం వహించగా.. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందించారు. ఇక, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ ఫస్ట్‌ లుక్, టీజర్, సాంగ్స్‌ ప్రేక్షకులకు నచ్చాయి.

గాడ్‌ఫాదర్ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన తార్‌‌మార్ తక్కర్‌‌ మార్ సాంగ్‌ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. చిరంజీవి పొలిటికల్‌ లీడర్‌‌గా కనిపిస్తున్న గాడ్‌ఫాదర్‌‌ సినిమాలో సల్మాన్‌ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తార్‌‌మార్‌‌ తక్కర్‌‌ మార్ పాటలో చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ వేసిన స్టెప్స్‌ మెగా అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగించింది. ‘నజభజ జజర.. గజగజ వణికించే గజరాజడిగోరా’ అంటూ సాగే లిరిక్స్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉన్నాయి. గాడ్‌ఫాదర్ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్‌‌ను ఎలివేట్‌ చేసేలా పాట లిరిక్స్‌ రాశారు. ఈ పాటకు థమన్ అందించిన మ్యూజిక్ బాగుంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన గాడ్‌ఫాదర్ సినిమా నుంచి మరో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్ చేశారు

సాల్ట్‌ అండ్ పెప్పర్‌‌ లుక్‌కు మంచి స్పందన..

గాడ్‌ఫాదర్ సినిమాలో మెగాస్టార్‌‌ లుక్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. సాల్ట్‌ అండ్ పెప్పర్‌‌ లుక్‌లో ఆయన స్టైల్‌ అదిరిందని అంటున్నారు అభిమానులు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, లేడీ సూపర్‌‌స్టార్ నయనతార, సత్యదేవ్, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. సూపర్‌‌గుడ్‌ ఫిలింస్, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా గాడ్‌ఫాదర్‌‌ సినిమాను రూపొందించాయి.

ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ‘యు / ఎ’ సర్టిఫికెట్‌ను అందించారు సెన్సార్ బోర్డు అధికారులు.   ఇక, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ (GodFather) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌‌ 28వ తేదీన సాయంత్రం 6 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహించనున్నారనే విషయం తెలిసిందే.

Read More : మెగా154లో చిరంజీవి (Chiranjeevi), రవితేజతోపాటు వెంకటేష్‌, నాగార్జున (Nagarjuna) కూడా నటించనున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!