కైకాల స‌త్య‌నారాయ‌ణతో కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి(Chiranjeevi).. చిరు, కైకాల కాంబో సినిమాలన్నీ హిట్లే..

Updated on Jul 26, 2022 10:35 AM IST
న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ బ‌ర్త్  డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి (Chiranjeevi)
న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ బ‌ర్త్ డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి (Chiranjeevi)

తెలుగు చిత్ర రంగంలో సీనియ‌ర్ న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. కైకాల న‌ట‌న‌కు న‌వ‌ర‌స న‌ట‌న సార్వ‌భౌమ అనే బిరుదు కూడా ఉంది. కైకాల స‌త్య‌నారాయ‌ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆయ‌న ఇంటికి వెళ్లారు. కైకాల‌తో చిరు కేక్ క‌ట్ చేయించారు. ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో ప్రస్తుతం వైర‌ల్ గా మారాయి.

కైకాల సత్యనారాయణ ఎన్నో విభిన్న పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కులకు వినోదం పంచారు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో తెలుగు సినిమా ప‌రిశ్రమ‌లోకి అడుగుపెట్టారు. కైకాల‌ 60 ఏళ్ల సినిమా జీవితంలో 777 సినిమాల్లో న‌టించారు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద సినిమాల్లో కైకాల స‌త్య‌నారాయ‌ణ న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. సీనియ‌ర్ న‌టుడు ఎస్వీ రంగారావు త‌ర్వాత అలాంటి పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. కైకాల ఎక్కువ‌గా ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో వెండితెర‌పై క‌నిపించేవారు. ప్ర‌తినాయ‌కుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు.  

 

న‌టుడు కైకాల స‌త్య‌నారాయ‌ణ బ‌ర్త్  డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేయించిన చిరంజీవి (Chiranjeevi)

కైకాల బ‌ర్త్ డే వేడుక‌కు చిరంజీవి

కైకాల స‌త్య‌నారాయ‌ణ 1935 జూలై 25న జ‌న్మించారు. కైకాల స‌త్య‌నారాయ‌ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి.. కైకాల‌ను క‌లిశారు. కైకాల ఇంటికి వెళ్లి మ‌రీ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీనియ‌ర్ న‌టుడు కైకాల‌తో కేక్ క‌ట్ చేయించారు. కైకాల అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. న‌డ‌వ‌లేని పరిస్థుతిలో మంచానికే ప‌రిమితం అయ్యారు. బెడ్‌పైనే కైకాల‌తో చిరంజీవి కేక్ క‌ట్ చేయించారు. ఆ ఫోటోల‌ను చిరంజీవి (Chiranjeevi) త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

 
 
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻
చిరంజీవి
 

చిరు, కైకాల కాంబో అప్ప‌ట్లో అదుర్స్

చిరంజీవి(Chiranjeevi), కైకాల సత్యనారాయణల కాంబినేష‌న్‌లో విడుద‌లైన ప‌లు సినిమాలు అప్ప‌ట్లో హిట్‌గా నిలిచాయి. వీరిద్ద‌రూ దాదాపు 50 సినిమాల్లో క‌లిసి న‌టించారు. చిరంజీవి హీరోగా న‌టించిన స్టేట్ రౌడీ, కొదమ సింహం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు, గ్యాంగ్ లీడ‌ర్ బావగారు బాగున్నారా వంటి సినిమాల్లో కైక‌ల ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు. 

చిరంజీవికి కైకాల అంటే ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఉంది. ప్ర‌తి సంవ‌త్స‌రం కైకాల పుట్టినరోజున ఆయ‌న నివాసానికి వెళ్లి మ‌రీ శుభాకాంక్ష‌లు తెలుపుతుంటారు. చిరంజీవి త‌న ఇంటికి రావ‌డం ఎంతో ఆనందాన్ని ఇస్తుంద‌ని కైకాల తెలిపారు. 

Read More : సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు : చిరంజీవి (Chiranjeevi) నటించిన టాప్ 10 సినిమాలు.. ఫ్యాన్స్‌కు ప్రత్యేకం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!