మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతుల మీదుగా ఆమిర్‌‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్ చడ్డా’ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్

Updated on Jul 24, 2022 08:16 PM IST
ఆమిర్‌‌ఖాన్ హీరోగా నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా తెలుగు ట్రైలర్‌‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రిలీజ్ చేశారు
ఆమిర్‌‌ఖాన్ హీరోగా నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా తెలుగు ట్రైలర్‌‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రిలీజ్ చేశారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. ఆమిర్ ఖాన్ హీరోగా న‌టించిన‌ తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. అద్వైత్ చందన్ దర్శకత్వంలో 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్', 'వయాకామ్ 18 స్టూడియోస్' సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఒక ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగచైతన్య నటించారు. 

ఇప్పటికే విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' ట్రైలర్‌, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్స్‌లో  వేగం పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. తెలుగు వెర్షన్‌కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఆమిర్‌‌ఖాన్ హీరోగా నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా పోస్టర్

ఆమిర్.. గొప్ప నటుడు: చిరంజీవి

ట్రైలర్‌ విడుదల చేసిన తర్వాత చిరంజీవి మాట్లాడారు. ‘ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నారు ఆమిర్‌ఖాన్. ఆయన నడక, నడవడిక నాకు ఎంతో ఇష్టం. ఆమిర్‌లాగే మేమూ నటించాలనుకుంటాం. కానీ, మాకున్న పరిమితుల వల్ల కుదరడం లేదు. ఆమిర్‌ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే.

 ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నాను. తొందరపడి ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని అన్నారు చిరంజీవి. అనంతరం చిరంజీవికి (Chiranjeevi) ఆమిర్‌ పానీ పూరి తినిపించారు. ఈ సందర్భంగా ఆమిర్‌తో నాగచైతన్య తెలుగులో డైలాగులు చెప్పించి అలరించారు.

Read More : మానాడు సినిమా రీమేక్‌.. దగ్గుబాటి రానా (Rana Daggubati) నటించనున్నారా? నిర్మిస్తున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!