మానాడు సినిమా రీమేక్‌.. దగ్గుబాటి రానా (Rana Daggubati) నటించనున్నారా? నిర్మిస్తున్నారా?

Updated on Jul 24, 2022 07:01 PM IST
శింబు హీరోగా తెరకెక్కిన మానాడు సినిమాలో నాగచైతన్యతో నటించనున్న రానా దగ్గుబాటి(Rana Daggubati)?
శింబు హీరోగా తెరకెక్కిన మానాడు సినిమాలో నాగచైతన్యతో నటించనున్న రానా దగ్గుబాటి(Rana Daggubati)?

టాలీవుడ్‌లో కొత్త కథనంతో సినిమాలు చేయాలంటే ముందుంటారు దగ్గుబాటి రానా (Rana Daggubati). దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన రానా తన నటనతో మంచి పేరు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

స్టార్ హీరో శింబు హీరోగా తెరకెక్కి, హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా మానాడు. తెలుగులో ‘ది లూప్‌’ అనే పేరుతో ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది ఈ సినిమా. ఈ సినిమాను తెలుగు హీరోతో రీమేక్‌ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్‌ రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా రైట్స్‌ను దక్కించుకుంది.

ది లూప్ సినిమా పోస్టర్

స్పందించిన నాగచైతన్య..

అక్కినేని నాగచైతన్య హీరోగా ఈ సినిమాను తెరకెక్కించే చాన్స్‌ ఉందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగచైతన్యతోపాటు రానా కూడా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై వచ్చే వార్తలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన థాంక్యూ సినిమా ప్రమోషన్స్‌లో మానాడు సినిమా రీమేక్‌పై స్పందించారని, ఈ సినిమాలో రానా భాగస్వామి కానున్నారని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే మానాడు సినిమా రీమేక్‌కు రానా నిర్మాతగా వ్యవహరిస్తారా? లేక నటిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక, నాగ చైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘థ్యాంక్యూ’ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విభిన్న ప్రేమకథగా రూపొందిన ఈ సినిమాలో రాశీఖన్నా, మాళవికా నాయర్‌, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటించారు. నాగచైతన్య తదుపరి సినిమా ‘మానాడు’ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. కాగా, రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

Read More : స్టార్ డమ్‌ ఉన్నా సంతోషంగా లేను: రజినీకాంత్‌ (Rajinikanth) కామెంట్స్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!