విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు ట్రైలర్.. అంచనాలు పెంచేలా యాక్షన్‌ సీన్స్‌

Updated on Jul 25, 2022 03:12 PM IST
విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు పోస్టర్
విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు పోస్టర్

యాక్షన్ హీరో విశాల్ (Vishal) సినిమాలకు టాలీవుడ్‌లో కూడా మంచి డిమాండ్ ఉంది. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా.. విశాల్ సినిమాకి కలెక్షన్స్‌ బాగానే వస్తాయి. ఇటీవల వచ్చిన ‘సామాన్యుడు’ సినిమాతో అంతగా మ్యాజిక్ చేయలేకపోయిన విశాల్ తాజాగా ‘లాఠీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సిన్సియర్ కానిస్టేబుల్‌గా బాక్సాఫీస్ వద్ద హల్‌చల్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా.. సామాన్య కానిస్టేబులైనా లాఠీ ఝళిపిస్తాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో, రాణా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రమణా నంద సంయుక్తంగా లాఠీ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతుండగా.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.

విశాల్ (Vishal) హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ సినిమా తెలుగు పోస్టర్

డైలాగ్స్‌లో అగ్రెసివ్‌నెస్‌..

గాయపడిన తనని బంధించిన గూండాలను ఉద్దేశిస్తూ.. ‘ఒరేయ్.. తప్పు చేసి తలదాచుకొనే పోకిరివి నీకే ఇంత పొగరుంటే, ఆ తప్పును నిలదీసే పోలీసోడ్ని నాకెంత పొగరుంటుంది? అనే విశాల్ డైలాగ్.. అతడిలోని ఎగ్రెసివ్‌నెస్‌ను ఎలివేట్ చేస్తోంది. నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో గూండాల బ్యాచ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తూ కానిస్టేబుల్ విశాల్ సృష్టించిన వీరంగం మామూలుగా లేదు.

‘ఊళ్ళో ఉన్న పోకిరిగాళ్లు నన్ను లేపేయడానికే కదరా ప్లాన్ చేశారు. ఇప్పుడు రండిరా..’ అంటూ విశాల్ (Vishal)  అరుపులు.. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్‌ ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలియజేసేలా ఉన్నాయి.

కొంచెం ఆలస్యంగా..

ముందుగా లాఠీ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్‌.  అయితే షూటింగ్‌లో విశాల్ గాయపడడం, ఫైట్స్ సీక్వెన్సెస్ కోసం భారీ విఎఫ్‌ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. దాంతో సెప్టెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సునైన హీరోయిన్‌గా నటిస్తున్న లాఠీ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విశాల్ నుంచి ఈ మధ్యకాలంలో ఈ తరహా యాక్షన్ మూవీ రాలేదు. పైగా ఇది పోలీస్ స్టోరీ కావడంతో లాఠీ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది. సెకండాఫ్‌లో 45 నిమిషాల పాటు సాగే యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రానికి హైలైట్ అవుతాయని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా విశాల్‌(Vishal) కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి మరి.

Read More : ఆ విషయంలో కూడా టాప్‌లోనే రజినీ కాంత్ (Rajinikanth) .. సూపర్‌‌స్టార్‌‌కు మరో అవార్డు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!