‘రామారావు ఆన్ డ్యూటీ’ డైరెక్టర్‌పై మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) షాకింగ్ కామెంట్లు.. వైరల్
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే ఆయన చిరంజీవి షూటింగ్ సెట్స్‌కు వెళ్లారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 154వ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో రవితేజ జాయిన్ అయినట్లు స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ సినిమాలో ఒక సాంగ్ తో పాటు యాక్షన్ సీన్‌ను కూడా రవితేజపై చిత్రీకరిస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన “రామారావు ఆన్ డ్యూటీ” జూలై 29వ తేదీన విడుదల కానుంది. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. యూట్యూబ్‌లో భారీ వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో ఉంది. గతంలోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉందని.. అయితే నిర్మాత సుధాకర్‌తో రవితేజకి గొడవలు జరిగాయని.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
ఎవరికీ సమస్య రాదు..
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో రవితేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ విషయంపై రవితేజ స్పందించారు. 'ఇండస్ట్రీలో ఇటువంటి రూమర్లు రావడం సాధారణమే. పనీ పాటా లేని వ్యక్తులు కొందరు ఇలాంటి వార్తలను సృష్టిస్తారు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితుడు. అతనితో ఎవరికీ సమస్య రాదు' అని చెప్పుకొచ్చారు రవితేజ.
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో సబ్ కలెక్టర్ క్యారెక్టర్‌లో నటించాను. ఇటువంటి క్యారెక్టర్ చేయడం కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఈ క్యారెక్టర్ నాకు కొత్తగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమాలో నటించాను' అని రవితేజ (Ravi Teja) చెప్పుకొచ్చారు. శరత్ మండవ దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు. స్వయంవరం, చిరునవ్వుతో, గోపి గోపికా గోదావరి లాంటి సినిమాలతో పాపులర్ అయిన హీరో వేణు తొట్టెంపూడి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.
Read More : నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న ‘దసరా’ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌లో పూర్ణ!