చిరంజీవి (Chiranjeevi) డాన్స్ వీడియోను పోస్ట్ చేసిన హాలీవుడ్ ద‌ర్శ‌కుడు

Updated on Sep 05, 2022 05:15 PM IST
ఓ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు చిరంజీవి  (Chiranjeevi)  న‌టించిన 'ముఠామేస్త్రి' సినిమాలోని పాట‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.
ఓ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు చిరంజీవి (Chiranjeevi)  న‌టించిన 'ముఠామేస్త్రి' సినిమాలోని పాట‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  డాన్సుల‌కు అప్ప‌ట్లో ఓ క్రేజ్ ఉండేది. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి సినిమాల‌కు ప్ర‌త్యేక‌త ఉంటుంది. చిరంజీవి పాట‌ల‌కు స్టెప్పులేస్తే థియేట‌ర్లు షేక్ అయ్యేవి. ఓ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు చిరంజీవి న‌టించిన 'ముఠామేస్త్రి' సినిమాలోని పాట‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పాట‌లో చిరంజీవి బ్యాట్‌మేన్‌లా క‌నబ‌డ‌తారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

ముఠామేస్త్రి సినిమా లుక్

చిరంజీవి (Chiranjeevi), రోజా న‌టించిన 'ముఠామేస్త్రి' చిత్రం 1993లో రిలీజ్ అయింది. ఈ సినిమా అప్ప‌ట్లో సూపర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవి, రోజా న‌టించిన పాట‌ను హాలీవుడ్ ద‌ర్శ‌కుడు జేమ్స్ గ‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. చిరంజీవి బ్యాట్‌మేన్‌గా అప్ప‌ట్లో అద‌ర‌గొట్టారంటూ పోస్ట్ చేశారు. ఇప్పుడు వ‌చ్చిన సినిమాలో బ్యాట్‌మేన్ లుక్ కూడా చిరంజీవి వేసిన గెట‌ప్‌తో మ్యాచ్ అయింద‌ట‌. ఆ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు జేమ్స్ గ‌న్ డైరెక్ట్‌గా చెప్ప‌కుండా చిరంజీవి వీడియోను పోస్ట్ చేశారు. 

చిరంజీవి (Chiranjeevi), రోజా, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన 'ముఠామేస్త్రి' సినిమా 1993లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాజ్ కోటి సంగీతం స‌మ‌కూర్చారు. జేమ్స్ గ‌న్ చిరంజీవిపై పెట్టిన‌ పోస్టుకు పలువురు సినీ ప్ర‌ముఖులు రిప్లైలు ఇస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్' సినిమాలో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ తండ్రే చిరు అంటూ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు చిరంజీవి స్పెష‌ల్ గెట‌ప్ సాంగ్‌ల‌ను తెగ పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ తెగ వైర‌ల్ చేస్తున్నారు. 

Read More: చిరంజీవి (Chiranjeevi) డ్రీమ్ రోల్‌ను త‌మ్ముడు చేస్తున్నారా?.. కొత్త గెట‌ప్ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!