మాలావత్ పూర్ణ (Poorna Malavath) , కావ్య మన్యపులను ప్రశంసించిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)

Updated on Sep 05, 2022 03:25 PM IST
చిరంజీవి కావ్య మన్యపు (Dr.KavyaManyapu), పూర్ణ మాలావత్ (PoornaMalavath) ఘనతల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరినీ సన్మానించారు.
చిరంజీవి కావ్య మన్యపు (Dr.KavyaManyapu), పూర్ణ మాలావత్ (PoornaMalavath) ఘనతల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరినీ సన్మానించారు.

టాలెంట్ ఉన్న యువ దర్శకులకు, టెక్నీషియన్లకు అవకాశాలిచ్చి ప్రోత్సహించే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎప్పుడూ ముందే ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా యువ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ కావ్య మన్యపు, పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ కలిశారు చిరంజీవి. తన నివాసానికి వచ్చిన వారిని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. 

అనంతరం చిరంజీవి కావ్య మన్యపు (Dr.Kavya Manyapu), పూర్ణ మాలావత్ (Poorna Malavath) ఘనతల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరినీ చిరు సన్మానించారు. దీనిపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. 

"ప్రతి అమ్మాయిలోనూ ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ ఇద్దరు డైనమిక్ యువతులు డాక్టర్ కావ్య మన్యపు (Dr.Kavya Manyapu), పూర్ణా మాలావత్ (Poorna Malavath) నిరూపించారు. అణగారిన వర్గాల బాలికలను విద్య, చైతన్యం, సాధికారిత దిశగా నడిపించేందుకు వీరిద్దరూ 'ప్రాజెక్ట్ శక్తి' చేపట్టారు. అందుకు వారి ప్రయత్నాలను అభినందిస్తున్నా" అని తెలిపారు. ఈ మేరకు కావ్య, పూర్ణలతో దిగిన ఫొటోలను కూడా చిరంజీవి పంచుకున్నారు.

కాగా, ఎవరూ ఎక్కని లడక్ లోని 6వేల అడుగులకు పైగా ఎత్తున్న పర్వతాన్ని మాలావత్ పూర్ణ (Poorna Malavath) , నాసా సైంటిస్ట్ కావ్య మన్యపులు ఎక్కారు. 100 మంది పేద బాలికలను విద్యతో పాటు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం కోసం ‘ప్రాజెక్ట్ శక్తి’ పేరుతో పర్వతారోహణ మొదలుపెట్టారు. 

మాలావత్ పూర్ణ, కావ్య మన్యపు (Dr.Kavya Manyapu) రూ.80 లక్షల దాకా నిధుల సేకరణే లక్ష్యంగా ఈ సాహసయాత్ర చేశారు. ఇకపై తాము చేపట్టే ప్రతి పర్వతారోహణ ద్వారా రూ.80 లక్షలు సేకరించాలని టార్గెట్ పెట్టుకున్నామని, వాటిని పేద బాలికల విద్యకు వినియోగిస్తామని చెప్పారు.

Read More: Megastar Chiranjeevi: మెగాస్టార్ సినిమా 'అడవి దొంగ' చూపిస్తూ బామ్మకు సర్జరీ.. చిరంజీవి స్పందన ఇదే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!