రోడ్డుపై డ్యాన్స్ చేస్తున్న రాంచరణ్‌ (Ram Charan).. ఆర్‌‌సీ15 నుంచి లీకైన వీడియో వైరల్

Updated on Sep 09, 2022 05:00 PM IST
మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఆర్‌‌సీ15పై భారీ అంచనాలు నెలకొన్నాయి
మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఆర్‌‌సీ15పై భారీ అంచనాలు నెలకొన్నాయి

మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఆర్‌‌సీ15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. దిల్‌ రాజు ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్న 50వ సినిమా కావడంతో, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ వంటి సూపర్‌‌ డూపర్‌‌ హిట్ తర్వాత రాంచరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా కావడంతో సాధారణంగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్‌ త్రిపాత్రాభినయం చేయనున్నారని టాక్. ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, ప్రాజెక్టుపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్ (Ram Charan) ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఆర్‌‌సీ15పై భారీ అంచనాలు నెలకొన్నాయి

మొబైల్‌ వీడియో..

ఆర్‌‌సీ15 సినిమా షూటింగ్‌ జరుగుతున్న సందర్భంలో తీసిన వీడియో ఇటీవలే లీకైంది. లీకైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. చెన్నైలోని ఓ రోడ్డుపై చిత్రీకరిస్తున్న చిత్ర సన్నివేశాలను గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఈ వీడియోలో రోడ్డు మీద స్టెప్పులేస్తున్న రాంచరణ్ (Ram Charan) ను చూడవచ్చు.

భారీ యాక్షన్ పార్ట్‌తో పాటు, సినిమాకు సంబంధించి పలు కీలక సన్నివేశాలను కూడా చెన్నైలోనే షూట్ చేస్తున్నారట డైరెక్టర్ శంకర్.  సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ ప్రత్యేకమైన సీక్వెన్స్‌ కోసం శంకర్ భారీగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. 20 నిమిషాలపాటు ఉండే ఈ సీక్వెన్స్‌ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

ఆర్‌‌సీ15 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాలో రాంచరణ్‌ (Ram Charan) సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జ‌యరామ్‌, అంజ‌లి, సునీల్, శ్రీకాంత్‌, న‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాంచరణ్ (Ram Charan) ఎలక్షన్ కమిషనర్‌గా కనిపించనున్నారని సమాచారం.

Read More : రాంచరణ్‌ (RamCharan) క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘ఆర్‌‌సీ15’ సినిమా నాన్‌ థియేట్రికల్ హక్కులకు అన్ని కోట్లా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!