మరో కొత్త సినిమా ప్రకటించే ఆలోచనలో మాస్ మహరాజా రవితేజ (Ravi Teja)

Updated on Aug 27, 2022 06:27 PM IST
మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో హిట్‌ కాలేదు
మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో హిట్‌ కాలేదు

హిట్ ప్లాప్‌ల​తో సంబంధం లేకుండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మాస్​ మహారాజా రవితేజ (Ravi Teja) స్టైల్.​ ఓ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టే రవితేజ ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాల్లో నటిస్తున్నాడు. ఇటీవల రవితేజ నటించిన రామారావు ఆన్​ డ్యూటీ  భారీ అంచనాల నడుమ విడుదలై ఆశించిన విజయం అందుకోలేదు. మెగాస్టార్​ చిరంజీవితో కలిసి ఓ సినిమాలో నటిస్తున్న రవితేజ మరో రెండు సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా అనుకున్న రేంజ్‌లో హిట్ సాధించకపోవడంతో తన ఆశలన్నీ రాబోయే సినిమాలపైనే పెట్టుకున్నాడు రవితేజ. ఈ క్రమంలోనే తను నటించబోయే తర్వాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడని ఇండస్ట్రీ టాక్.

మాస్ మహారాజా రవితేజ (RaviTeja) హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో హిట్‌ కాలేదు

యాక్షన్​ థ్రిల్లర్​తో..

ఈ క్రమంలో ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీకి ఈగల్ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇంతకుముందు నిఖిల్ హీరోగా నటించిన సూర్య వెర్సెస్ సూర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు కార్తీక్ ఘట్టమనేని. తర్వాత సినిమాటోగ్రాఫర్ గానే కెరీర్ కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు.

ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) మూవీ ఉండే ఛాన్స్ ఉంది.

Read More : రవితేజకు (Ravi Teja) చిరంజీవి స్ఫూర్తి .. నాకు రవితేజ స్ఫూర్తి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్​లో నాని (Nani)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!