అమెజాన్‌ ప్రైమ్‌లో సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’. చూడాలంటే అదనంగా చెల్లించాల్సిందే

Updated on Jun 02, 2022 06:03 PM IST
మహేష్‌బాబు (MaheshBabu)
మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) ప్రస్తుతం తన కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే నిర్మాతల్లో ఒకడిగా తెరకెక్కించిన అడివి శేష్‌ ‘మేజర్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నాడు. సర్కారు వారి పాట ఈ సినిమా మే 12వ తేదీన రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్‌‌ హిట్‌గా నిలిచింది. మహేష్‌బాబు కెరీర్‌‌లోనే హయ్యెస్ట్‌ ఓపెనింగ్స్‌ సాధించిన సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.

సర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్‌బాబు క్యారెక్టరైజేష‌న్‌, ఎన‌ర్జీ, డైలాగ్ మాడ్యులేషన్‌ గ‌త చిత్రాల‌తో పోలిస్తే కొంత డిఫరెంట్‌ ఉంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్‌ అయ్యింది. తాజాగా స‌ర్కారు వారి పాట చిత్ర యూనిట్ సినీ ప్రేమికులు, మహేష్‌ అభిమానులకు బిగ్‌ సర్‌‌ప్రైజ్ ఇచ్చింది.

ఇటీవల ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌‌షిప్‌ ఉన్న వాళ్లు కూడా సర్కారు వారి పాట సినిమా చూడాలంటే మరిన్ని డబ్బులు చెల్లించాలనే  షరతు పెట్టింది. అంటే ఈ సినిమాను అమెజాన్‌లో ‘పే పర్‌‌ వ్యూ’ పద్దతిలో విడుదల చేశారు. ప్రైమ్‌ మెంబర్‌‌షిప్ ఉన్న కస్టమర్లు సర్కారు వారి పాట సినిమా చూడాలంటే అదనంగా రూ.199 చెల్లించాలి.

మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాను అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా చూడాలంటే మాత్రం మరో పది రోజులు ఆగాల్సిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో సముద్రఖని  విలన్‌గా చేశాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌‌టైన్‌మెంట్స్​తో కలిసి జీఎమ్‌బీ ఎంట‌ర్‌‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కించింది.

కాగా, బాక్సాఫీస్‌ దగ్గర ఇప్పటికే కోట్లు కొల్లగొట్టిన సర్కారు వారి పాట సినిమాలో మరో పాటను చిత్ర యూనిట్‌ ఇటీవల యాడ్ చేసింది. ‘మురారి వా’ పాటతో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్ థియేటర్లను మరింతగా హోరెత్తించనున్నారు.

 

Read More: వసూళ్ల వర్షం కురిపిస్తున్న మహేష్‌బాబు (MaheshBabu) ‘సర్కారు వారి పాట’ సినిమా.. రూ.200 కోట్లు వసూలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!