Aishwarya Rai Bachchan : రాజమౌళి చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన, ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్.. నిజమేనా ?

Updated on Jun 13, 2022 11:31 AM IST
ఐశ్వ‌ర్య‌రాయ్ రాజ‌మౌళి (SS Rajamouli) సినిమాలో చేస్తే  ఓ వండ‌ర్ అంటున్నారు ప్రేక్ష‌కులు.
ఐశ్వ‌ర్య‌రాయ్ రాజ‌మౌళి (SS Rajamouli) సినిమాలో చేస్తే  ఓ వండ‌ర్ అంటున్నారు ప్రేక్ష‌కులు.

తెలుగు సినిమా నాడి తెలిసిన ద‌ర్శ‌కుడు రాజమౌళి (SS Rajamouli). బాహుబ‌లి సినిమాతో ఇండియ‌న్ రికార్డులు తిర‌గ‌రాశాడాయన. సినీ విమర్శకుల చేతే దర్శ‌క ధీరుడు అనిపించుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్. సినిమాతో పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్ అయ్యాడు. బ్ర‌హ్మాస్త్రం సినిమా రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో విడుద‌ల కానుంది. రాజ‌మౌళి త‌న నెక్ట్స్ సినిమాను మ‌హేష్ బాబుతో తీస్తున్నారు. రాజ‌మౌళి, మ‌హేష్ కాంబో సినిమాపై ప‌లు ఆస‌క్తికరమైన విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. 

రాజ‌మౌళి దర్శకత్వంలో ప్రపంచ సుందరి ?

ఎస్ ఎస్ రాజ‌మౌళి మ‌హేష్ బాబుతో చేసే సినిమాలో మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) ను తీసుకుంటున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ చిత్రంలో ఓ ప్రధానమైన పాత్రలో ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టిస్తున్నారట‌. ఈ విషయంపై అధికారికంగా ఇంకా ప్ర‌క‌ట‌న రాలేదు. పైగా ఇది రూమర్ కూడా అయ్యే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు అంటున్నారు.

ఐశ్వ‌ర్య‌రాయ్ ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు సినిమాలో కూడా ముఖ్య పాత్రలలో నటించలేదు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తార‌లంతా తెలుగు సినిమాల‌కు క్యూ క‌డుతున్నారు. రాజ‌మౌళి కూడా అందుకే ఐశ్వ‌ర్యను ఓకే చేశార‌నే న్యూస్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇక ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్... ర‌జ‌నీకాంత్ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తార‌నే మరో వార్త కూడా సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

వైవిధ్యమైన పాత్రలో ఐశ్వర్యారాయ్‌ ?

ఇటీవలే ప్ర‌పంచ సినిమా వేడుక‌లైన కేన్స్ ఫెస్టివ‌ల్‌లో ఐశ్వ‌ర్య‌రాయ్ త‌ళుక్కుమ‌న్నారు. ఐశ్వ‌ర్య‌రాయ్‌తో రాజ‌మౌళి సినిమా చేస్తే, అది ఓ ప్రపంచ స్థాయి సినిమా అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు. ఐశ్వ‌ర్య‌రాయ్‌తో ఒక డిఫరెంట్ పాత్రను చేయించే స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అని కూడా అంటున్నారు. ఇక వీరిద్ద‌రి కాంబోలో ఎలాంటి సినిమా రానుందో చూడాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రూమర్లు ఎక్కువైపోయాయి.  ఈ క్రమంలో, ఈ వార్తలో నిజమెంత ఉందో కూడా మనం తెలుసుకోవాలి. 

ఆఫ్రిక‌న్ అడ‌వుల‌ నేపథ్యంలో తీసే అడ్వెంచర్ థ్రిల్లర్‌ను రాజ‌మౌళి తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో మ‌హేష్‌తో రాజ‌మౌళి (SS Rajamouli) ఎలాంటి సాహ‌సాలు చేయిస్తారో మనం వేచి చూడాలి. అలాగే మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌రో సినిమా చేస్తున్నారు. జూలై నుంచి ఆ సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. 

Read More: ర‌జ‌నీకాంత్ (Rajnikanth), ఐశ్వ‌ర్య‌రాయ్ బ‌చ్చ‌న్ (Aishwarya Rai Bachchan) కాంబో సినిమాకు లైన్ క్లియ‌ర్‌!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!