మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) బ్యానర్‌‌లో ఫస్ట్ సినిమా! ఏ భాషలో.. డైరెక్టర్ ఎవరంటే?

Updated on Oct 27, 2022 04:08 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది

టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని (Mahendra Singh Dhoni) దక్షిణాది భాషల్లో సినిమాలు చేయనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ధోని ఎంటర్‌‌టైమ్‌మెంట్ అనే పేరుతో బ్యానర్‌‌ను స్థాపించి సినిమాలు చేయనున్నట్టు ప్రకటించారు కూడా. అయితే మొదటి సినిమా ఏ భాషలో తెరకెక్కించనున్నారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు? హీరో ఎవరనే విషయాలపై సందిగ్ధత నెలకొంది.

తమ అభిమాన క్రికెటర్‌‌ ధోనీ సినిమా ఇండస్ట్రీలో కూడా అద్భుతాలు సృష్టిస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. అలాగే ధోనీ చేయబోయే సినిమాలను గురించిన వివరాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ధోనీ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్ బ్యానర్‌‌లో చేయబోయే సినిమాపై ఆసక్తికర అప్‌డేట్ వచ్చింది. సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు అనే దానిపై క్లారిటీ ఇచ్చింది ధోనీ టీమ్.

భార్య సాక్షి సింగ్‌తో కలిసి ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌తో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌‌లో తెరకెక్కించనున్న మొదటి సినిమాకు రమేష్‌ తమిళ్‌మని దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో తెరకెక్కనున్న ఈ సినిమాను వేరే భాషల్లోకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది

కథ అందిస్తున్న సాక్షి సింగ్..

రమేష్‌ తమిళ్‌మని దర్శకత్వం వహించనున్న సినిమాకు సాక్షి సింగ్‌ కథ అందిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్‌ ఏంటి అనేది ఇప్పటివరకు ఖరారు చేయలేదు. అలాగే  ఈ సినిమాలో నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. అన్ని ప్రధాన భాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను అందించనున్నట్టు ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ తెలిపింది.

తమిళంతోపాటు ప్రధాన భాషల్లో సైన్స్‌ ఫిక్షన్‌, కామెడీ డ్రామా, కామెడీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్లతోపాటు వివిధ జోనర్లలో అర్థవంతమైన కంటెంట్‌ సినిమాలు, ఇతర ప్రాజెక్ట్‌లు చేయాలని ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు డైరెక్టర్లు, స్క్రిప్ట్‌ రైటర్లతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలిపింది. 

చాన్స్ రావడం ఆనందంగా ఉంది: డైరెక్టర్

సాక్షి సింగ్ ధోనీ రాసిన కథ చదివాను. అది చాలా ప్రత్యేకమైనదని అనిపించింది. ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌ కాన్సెప్ట్‌కు దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉందని డైరెక్టర్‌ రమేష్‌ తమిళ్‌మని అన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు.

Read More : Exclusive : అమ్మే నా ఇన్‌స్పిరేషన్.. స్టార్‌‌ హీరోయిన్‌ కావాలనేదే టార్గెట్: హాన్విక శ్రీనివాస్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!