EXCLUSIVE : అమ్మే నా ఇన్‌స్పిరేషన్.. స్టార్‌‌ హీరోయిన్‌ కావాలనేదే టార్గెట్: హాన్విక శ్రీనివాస్

Updated on Nov 05, 2022 03:59 PM IST
టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్
టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లకు ఆదరణ అంతంత మాత్రమే. అయినా టాలెంట్‌ను నమ్ముకుని కష్టపడి తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు కొందరు తెలుగు అమ్మాయిలు. ఇప్పటికే అంజలి, రీతూ వర్మ, ఈషా రెబ్బా, కలర్స్‌ స్వాతి వంటివారు అందంతోపాటు అభినయంలో కూడా తామేం  తక్కువ కాదని నిరూపించుకున్నారు.

తెలుగుతోపాటు తమిళ, కన్నడ పరిశ్రమల్లోనూ రాణిస్తూ ఉత్తరాది భామలతో పోటీ పడుతున్నారు. ఆ జాబితాలో చేరడమే లక్ష్యంగా ముందుకు అడుగులేస్తున్న మరో తెలుగమ్మాయి హాన్విక శ్రీనివాస్.

టిక్‌టాక్‌తో మొదలైన తన ప్రయాణాన్ని..సీరియల్స్, సినిమాలు అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటూ.. స్టార్‌‌ హీరోయిన్‌ కావాలనే తన టార్గెట్‌ వైపునకు దూసుకెళుతున్న హాన్విక పింక్‌విల్లాతో ప్రత్యేకంగా పంచుకున్న ముచ్చట్లు.

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

హాయ్.. హాన్విక.. ఎలా ఉన్నారు?

బాగున్నాను.

మీ సొంత ఊరు ఏది?

అమ్మ లలిత, నాన్న శ్రీనివాస్, చెల్లి గ్రీష్మశ్రీ. నాన్న హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అమ్మ బిజినెస్‌ చేసేవారు. చెల్లి చదువుకుంటోంది. మాది విశాఖపట్నం. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. చదువే నా ప్రపంచం. వైజాగ్‌లోనే ఇంటర్మీడియట్ పూర్తిచేశా. తర్వాత సినిమా అవకాశాల కోసం అమ్మతో కలిసి హైదరాబాద్‌ వచ్చాను. ప్రస్తుతం నటనతో పాటు చదువును కూడా కొనసాగిస్తున్నాను. లా పూర్తి చేయాలని అనుకుంటున్నాను.

ఇండస్ట్రీలో వైపు రావాలని ఎందుకు అనిపించింది?

నిజానికి నటనవైపు రావాలని ఎప్పుడూ అనుకోలేదు. కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌  చేశాను. తర్వాత అమ్మకు తెలిసిన వాళ్లు సినిమాల్లో నటిస్తుందా? అని అడిగారు.

అప్పుడు కూడా నటనపై పెద్దగా ఆసక్తి లేదు. కొన్నాళ్లకు అనుకోకుండా ఒక సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ వచ్చింది. నేను చేయగలనా? లేదా? అని సందేహిస్తున్నప్పుడు అమ్మ, నాన్న ధైర్యం చెప్పారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

ఆ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ కొన్ని కాంటాక్ట్స్‌ ఇచ్చి హైదరాబాద్‌ వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు ‘ఈనాడు’లో ప్రసారమయ్యే ‘అభిషేకం’ సీరియల్‌లో మొదటిసారి అవకాశం వచ్చింది.

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

యాక్టింగ్‌లో ఏమైనా శిక్షణ తీసుకున్నారా?

ప్రత్యేకంగా యాక్టింగ్‌లో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. భరతనాట్యం నేర్చుకున్న కారణంగా నటించడం ఇబ్బంది అనిపించడం లేదు. ఏ క్యారెక్టర్‌‌ అయినా సులువుగానే చేస్తాను. అయితే ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటిస్తానని దర్శకులు చెప్తుంటారు.

ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా?

నిజం చెప్పాలంటే మా బంధువుల్లో చాలామందికి ఇండస్ట్రీ అంటే సదభిప్రాయం లేదు. వాళ్ల మాటను కాదని, నన్ను ప్రోత్సహించడానికి ముందు మా అమ్మ, నాన్న కూడా భయపడ్డారు. కానీ, చదువుకుంటూనే సినిమాల్లోనూ నటిస్తానని, నాపై నమ్మకం ఉంచమని కోరడంతో ఒప్పుకున్నారు.

ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అమ్మా, నాన్న చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపించాల్సిన అమ్మాయిని ఇండస్ట్రీకి పంపించారని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. అయినా అవేవీ పట్టించుకోకుండా వారు నన్ను ప్రోత్సహించారు. అప్పుడు అవమానించిన వాళ్లే ఇప్పుడు నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే వారు సంతోషపడుతున్నారు. 

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

మీ ఇన్‌స్పిరేషన్ ఎవరు?

అన్ని విషయాలలోనూ తోడుగా ఉండే మా అమ్మ నాకు ఇన్‌స్పిరేషన్. నిజానికి అమ్మే నా తొలి గురువు. ఏ సీన్ చేయాలన్నా ముందుగా నన్ను ట్రైన్ చేస్తుంటుంది. బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగులు చెప్పే విధానం వరకు అన్నీ వారు దగ్గరుండి చూసుకుంటారు. లాభాల్లో ఉన్న బిజినెస్‌ను వదులుకుని అమ్మ నా కోసం హైదరాబాద్ వచ్చేశారు. ఇండస్ట్రీలో హీరో నాని నాకు ఇన్‌స్పిరేషన్. ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్టార్ హీరోగా ఎదిగారు.

మీకు ఇష్టమైన నటీనటులు?

అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమె అందం, నటన నాకు చాలా నచ్చుతాయి. ఇండస్ట్రీలో ఆమెకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆమె స్థాయికి ఎదగాలని నా కోరిక. సాయిపల్లవి అంటే కూడా ఇష్టం. హీరోలలో జూనియర్‌‌ ఎన్టీఆర్‌‌ నా ఫేవరెట్.

ఇప్పటివరకు నటించిన సినిమాలు..

ఈటీవీలో ప్రసారమైన ‘అభిషేకం’ సీరియల్‌లో మొదటిసారి నటించాను. రాజశేఖర్‌‌ గారు ముఖ్య పాత్రలో నటించిన ‘శేఖర్’ సినిమాలో ఆయనకు కూతురుగా చేశాను. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ‘మల్లెతీగ’ సినిమాతోపాటు సూపర్‌‌గుడ్‌ ఫిలిమ్స్ బ్యానర్‌‌లోని పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తున్నాను. జెమినిలో ప్రసారమవుతున్న ‘సాధన’ సీరియల్‌లో నటిస్తున్నాను. నేను హీరోయిన్‌గా నటించిన ‘పవిత్రా సమేత’ సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్ కానుంది.

మీ డ్రీమ్‌ రోల్?

‘జై భీమ్’ సినిమాలో లిజిమోల్‌ జోస్ చేసిన చిన్నతల్లి లాంటి పాత్రలో నటించాలని ఉంది. ‘మల్లెతీగ’ సినిమాలో నేను చేసిన పాత్ర అదే విధంగా ఉంటుంది. అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనేది నా కల.

ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్లకి ఏం చెప్తారు?

ప్రతి దాంట్లోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి. మనం ఏ దారిలో వెళ్తున్నామనేదే ముఖ్యం. మంచి దారిని సెలక్ట్‌ చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. నచ్చిన దారిలో వెళ్లాలని డిసైడ్ అయిన తర్వాత, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకూడదు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా ధైర్యంగా నిలబడాలి. కష్టపడితే మంచి ఫలితం దక్కుతుందని నమ్ముతాను.

ఆల్‌ ది బెస్ట్‌.. హాన్విక..

థాంక్యూ.. వెరీ మచ్.

Read More : 'వీరసింహారెడ్డి'గా అలరించనున్న నందమూరి బాలకృష్ణ (BalaKrishna).. ఎన్‌బీకే107’ టైటిల్ ఫిక్స్

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

టిక్‌టాక్, సీరియల్స్, సినిమాల్లో కీలకపాత్రలు.. ఇప్పుడు హీరోయిన్‌గా నటిస్తూ టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు హాన్విక శ్రీనివాస్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!