కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో సినిమా చేయనున్న రజినీకాంత్ (Rajinikanth).. కథ రెడీ అయ్యిందని టాక్

Updated on Nov 02, 2022 02:09 PM IST
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.

రజినీకాంత్ (Rajinikanth).. తమిళంలోపాటు అన్ని భాషల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఆయన సినిమా విడుదలవుతోందంటే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంత హడావిడి ఉంటుందో అదే రేంజ్‌లో సంబరాలు టాలీవుడ్‌లో కూడా జరుగుతాయి. రోబో, 2.0 సినిమాల తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ రజినీకి దక్కలేదు.

ప్రస్తుతం రజినీకాంత్‌ సరైన కంబ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జైలర్ తర్వాత లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌లో రెండు సినిమాలకు సైన్ చేశారు రజినీ. ఈ సినిమాలు ఎవరి దర్శకత్వంలో తెరకెక్కనున్నాయనే విషయాలపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా దీనిపై ఒక వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.

జైలర్ షూటింగ్‌ తర్వాత..

లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌లో చేయనున్న రెండు సినిమాల్లో ఒకదానికి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని టాక్. వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమా షూటింగ్‌లోనూ, ఐశ్వర్య పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.

 ‘3’ సినిమాతో ఐశ్వర్య దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత ‘వాయ్‌ రాజా వాయ్‌’, ‘సినిమా వీరన్‌’ వంటి సినిమాలను తెరకెక్కించింది. భర్త ధనుష్‌తో విడాకులు తీసుకున్నారు ఐశ్వర్య. విడాకుల తర్వాత ఐశ్వర్య పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య ‘ఓ సాతి చల్‌’ అనే హిందీ సినిమా చేస్తునారు. రజినీకాంత్‌ (Rajinikanth) – ఐశ్వర్య కాంబోలో తెరకెక్కబోయే సినిమా గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : 31 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబినేషన్‌! రజినీకాంత్‌ (Rajinikanth)కు స్టోరీ లైన్ చెప్పిన మణిరత్నం (ManiRatnam)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!