హీరో కార్తీ (Karthi) ‘సర్దార్’ (Sardar) రిలీజ్‌ డేట్ ఫిక్స్.. పోస్టర్ విడుదల చేసిన అన్నపూర్ణ స్టూడియోస్

Updated on Oct 15, 2022 04:16 PM IST
కార్తీ (Karthi) హీరోగా నటించిన సర్దార్ సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది
కార్తీ (Karthi) హీరోగా నటించిన సర్దార్ సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది

ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ సినిమాలతో తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు తమిళ హీరో కార్తీ (Karthi). ప్రస్తుతం కార్తీ నటిస్తున్న సినిమా సర్దార్ (Sardar). పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. లైలా, చంకీ పాండే కీలకపాత్రలు పోషించారు. తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకేసారి సర్దార్ సినిమాను విడుదల చేస్తోంది చిత్ర యూనిట్.

ఎప్పుడూ విభిన్న క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించే కార్తీ.. ఈసారి డిఫరెంట్ కథనం, కథాంశంతోపాటు గెటప్స్‌ కూడా కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్, టీజర్‌‌ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. దేశం కోసం పని చేసే స్పై.. అదే దేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి ఎందుకు రెడీ అయ్యారు అనేది సినిమా కథ అని తెలుస్తోంది. యాక్షన్ ప్రధానంగా కూడా సినిమా సాగినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. 

కార్తీ (Karthi) హీరోగా నటించిన సర్దార్ సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది

ఆరు గెటప్స్‌తో..

ఇండియన్ మిలిటరీ నేపథ్యంలో సర్దార్ సినిమా తెరకెక్కినట్టు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. ఆరు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు హీరో కార్తీ. భారీ యాక్షన్‌ సీన్లకు తగినట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.

సర్దార్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్‌‌ 21వ తేదీన సర్దార్ సినిమాను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఒక పోస్టర్‌‌ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ట్విట్టర్‌‌లో ఈ టీజర్ వైరల్ అవుతోంది. మొత్తానికి టీజర్‌‌తోనే సర్దార్ (Sardar) సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు కార్తీ (Karthi)

Read More : కార్తీ నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ వచ్చేసింది... ఆ సినిమా తర్వాతే 'ఖైదీ 2' (Khaidi 2) షూటింగ్ స్టార్ట్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!