Vikrant Rona: 'విక్రాంత్ రోణ' తెర‌కెక్కించాలంటే ధైర్యం ఉండాలి : రాజ‌మౌళి (S. S. Rajamouli)

Updated on Aug 06, 2022 02:29 PM IST
 Vikrant Rona: 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారంటూ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి (S. S. Rajamouli) తెలిపారు. 
 Vikrant Rona: 'విక్రాంత్ రోణ' చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారంటూ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి (S. S. Rajamouli) తెలిపారు. 

Vikrant Rona: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుద‌లైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. మొద‌టి వారంలోనే దాదాపు రూ. 120 కోట్ల‌ను కొల్ల‌గొట్టింది. ఈ సినిమాపై ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి (S. S. Rajamouli) ప్ర‌శంస‌లు కురిపించారు. 'విక్రాంత్ రోణ' సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారంటూ ట్వీట్ చేశారు.

అత్యధిక బడ్జెట్‌ సినిమా

కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ జులై  28న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం కన్నడతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో థియేట‌ర్ల‌లో విడుదలై, ఇప్పుడు ఊహించని కలెక్షన్లతో దూసుకెళుతోంది. 'విక్రాంత్ రోణ' సినిమాను రూ. 95 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. కన్నడంలో అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన సినిమాల్లో 'విక్రాంత్ రోణ' ఒక‌టి.

ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మాత‌ జాక్ మంజునాథ్ నిర్మించారు. అనూప్‌ భండారీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నీతా అశోక్‌, నిరూప్‌ భండారీ ముఖ్యపాత్రల్లో న‌టించారు.

 

న‌మ్మ‌కం కూడా ఉండాలి - రాజ‌మౌళి (S. S. Rajamouli)

'విక్రాంత్ రోణ' చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారంటూ టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కులు రాజ‌మౌళి ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. హీరో కిచ్చా సుదీప్‌కు తన అభినందనలను తెలియ‌జేశారు. 'విక్రాంత్ రోణ' సినిమా చేయాలంటే ద‌మ్ము, ధైర్యం ఉండాల‌న్నారు.

అలాగే ఈ సినిమాపై పెట్టుబ‌డి పెట్టేందుకు న‌మ్మ‌కం కూడా ఉండాల‌ని తెలిపారు. క్లైమాక్స్ చాలా బాగుందని.. మిత్రుడు భాస్కర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలంటూ రాజ‌మౌళి (S. S. Rajamouli) ట్వీట్ చేశారు.

Read More: Vikrant Rona 3D Trailer: ‘విక్రాంత్ రోణ’ 3D ట్రైలర్ సందర్భంగా హీరో సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!