ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa) మల్టీస్టారర్ మూవీ కబ్జా (Kabzaa).. 'కేజీఎఫ్' రేంజ్ లో టీజర్

Updated on Sep 17, 2022 09:08 PM IST
'కబ్జా' (Kabzaa Movie) చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి.
'కబ్జా' (Kabzaa Movie) చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి.

కన్నడ స్టార్ యాక్టర్స్ ఉపేంద్ర (Upendra), కిచ్చా సుదీప్ (Kichcha Sudeepa) ప్రధాన పాత్రల్లో తాజాగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ 'కబ్జా' (Kabzaa). ఆర్‌.చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ త‌ర్వాత ఆ స్థాయిలో తెర‌కెక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ మూవీని ఏకంగా 7 భారతీయ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. 

'కేజీఎఫ్' (KGF Movie) మూవీస్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రశేఖర్ 'కబ్జా' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా క‌థ 1947-1984 మ‌ధ్య సమయంలో జ‌రుగుంద‌ట‌. అనుకోని ప‌రిస్థితుల్లో ఓ స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడి కొడుకు మాఫీయా ప్ర‌పంచంలో ఎలా చిక్కుకున్నాడు, దానికి కారణం ఏమిటి, ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో సినిమా భారీ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. 

'కబ్జా' (Kabzaa Movie) చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచ‌నాలు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో విజువ‌ల్స్ గాని, సెట్టింగ్స్ గాని కేజీఎఫ్ రేంజ్‌లో ఉన్నాయి. ఇద్ద‌రు హీరోలు ఒకే స్క్రీన్‌పై పోటా పోటిగా న‌టించడంతో సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీ పెరిగింది. చివర్లో శ్రియా శరణ్ (Shriya Saran) తళుక్కుమని మెరిసింది.   

నేడు జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో భాగంగా రానా దగ్గుబాటి (Hero Rana) ఈ టీజర్ ని రిలీజ్ చేసారు. ఇక టీజర్ లో భారీ స్థాయి విజువల్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, ఎమోషల్ సన్నివేశాలు ఎంతో బాగున్నాయి. అలానే అదిరిపోయే సెట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎంతో బాగుంది. ఒకరకంగా ఈ టీజర్ ని (Kabzaa Teaser) చూస్తే మనకు కేజీఎఫ్ వైబ్స్ గుర్తకువస్తాయనే చెప్పాలి.

Read More: Vikrant Rona: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) పాన్‌ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!