Kiccha Sudeepa: సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న 'విక్రాంత్ రోణ'(Vikrant Rona).. సక్సెస్ మీట్ లో కిచ్చా సుదీప్

Published on Aug 02, 2022 06:55 PM IST

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeepa), దర్శకుడు అనూప్ బండారి కాంబినేషన్ లో వచ్చిన అడ్వెంచర్ ఫిల్మ్ ‘విక్రాంత్ రోణ’(Vikrant Rona). ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. 

తాజా సమాచారం ప్రకారం 'విక్రాంత్ రోణ‌' ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ పాయింట్ ని (Vikrant Rona Break Even) చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ సినిమా తెలుగులో తక్కువ ధరకి అమ్ముడవడంతో బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.  

‘విక్రాంత్ రోణ’(Vikrant Rona) సినిమా విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లు రాబడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆదివారం నాడు రూ.29 కోట్లు వసూలయ్యాయి. దాంతో, తొలి వారంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 115-120 కోట్ల వసూళ్లు రాబట్టనున్నట్టు సమాచారం. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) ‘షంషేరా’ మొదటి వారంలో రూ.40 కోట్లు మాత్రమే సాధించగా.. ‘విక్రాంత్ రోణ’ అంతకు మూడింతలు వసూళ్లు రాబట్టడం విశేషం.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన విజువల్ వండర్ ‘విక్రాంత్ రోణ’పై ప్రశంసల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. అలాగే విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సుదీప్ ను అభినందించినట్టు సమాచారం. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కిచ్చా సుదీప్ ను, విక్రాంత్ రోణ చిత్రానికి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియాలో సినిమా విజయవంతం అంటూ సుదీప్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Read More: ‘విక్రాంత్ రోణ’ 3D ట్రైలర్ సందర్భంగా హీరో సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!