యశ్‌ (Yash) హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్‌ హిట్‌ సినిమా ‘కేజీఎఫ్‌2’ (KGF 2) మరో రికార్డు

Updated on Jul 16, 2022 07:57 PM IST
యశ్‌ (Yash) కేజీఎఫ్‌2 సినిమా పోస్టర్
యశ్‌ (Yash) కేజీఎఫ్‌2 సినిమా పోస్టర్

యశ్‌ (Yash) హీరోగా తెరకెక్కిన సెన్సేషనల్ సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్‌ నుంచి వచ్చిన రెండో భాగం కేజీఎఫ్‌2 రికార్డులు తిరగరాసింది. కేజీఎఫ్‌2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. వసూళ్ల పరంగా ఒక్క హిందీ భాషలోనే రూ.430 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్లకు పైగా వసూలు చేసింది.

కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2 సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను సృష్టించింది. కరోనా కారణంగా కుదేలైన సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని తేవడంలో కేజీఎఫ్‌2 సినిమా కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో కూడా కేజీఎఫ్‌2 సినిమా ఎన్నో రికార్డులు సాధించింది.

కేజీఎఫ్‌2 సినిమా పోస్టర్

ఐఎండీబీ రేటింగ్స్‌లో..

2022 మొదటి ఆరు నెలల్లో రిలీజైన సినిమాల్లో ‘మోస్ట్ పాపులర్ ఇండియన్‌ ఫిల్మ్’ కేటగిరీలో ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) 8.5 రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్‌2 సినిమా మరో ఘనత సాధించింది. సినిమా రేటింగ్స్, రివ్యూలు ఇచ్చే ఓర్ మ్యాక్స్ పవర్‌‌ రేటింగ్స్‌లో రికార్డు సృష్టించింది.

ఓర్ మ్యాక్స్‌ పవర్ రేటింగ్స్‌లో 90+ స్కోరు సాధించిన మొదటి సినిమాగా ‘కేజీఎఫ్‌2’ సినిమా వరల్డ్ రికార్డును నెలకొల్పింది. దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా అంత ఎక్కువ స్కోరు సాధించడం గొప్ప విషయం అని, ఇది అరుదుగా దక్కే గౌరవం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, కేజీఎఫ్‌, కేజీఎఫ్‌2 సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నారు యశ్ (Yash). అయితే ఈ సినిమాల తర్వాత యశ్‌ చేయబోయే సినిమాలపై ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు.   

Read More : టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించనున్న హీరో నితిన్ (Nithiin).. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కోసమేనా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!