‘అపరిచితుడు’ను పక్కనపెట్టేసిన శంకర్ (Shankar)!.. రణ్​‌వీర్ (Ranveer Singh)తో ‘వేల్పారి’ ట్రయాలజీకి ప్లాన్?

Updated on Nov 09, 2022 05:13 PM IST
ఓ తమిళ నవల ఆధారంగా హిందీ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో పాన్ ఇండియా చిత్రాన్ని తీసేందుకు శంకర్ (Shankar) ప్లాన్ చేస్తున్నారట.
ఓ తమిళ నవల ఆధారంగా హిందీ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)తో పాన్ ఇండియా చిత్రాన్ని తీసేందుకు శంకర్ (Shankar) ప్లాన్ చేస్తున్నారట.

దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన శంకర్ (Shankar) సినిమాలో నటించేందుకు నటులందరూ ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన విజన్ అలాంటిది మరి. ఒకవైపు సమాజాన్ని, వ్యవస్థలను ప్రశ్నిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేసే శంకర్.. మరోవైపు కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆయన చిత్రాలకు అంత డిమాండ్ ఉంటుంది. హీరోలు, హీరోయిన్లను శంకర్ చూపించే తీరు నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. ఇంకా ఆయన చిత్రాల్లో పాటలు ఎంత రిచ్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

‘అపరిచితుడు’ రీమేక్ అటకెక్కినట్లేనా?
శంకర్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలనుకునే వారిలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కూడా ఉన్నారు. ఎట్టకేలకు వీరి కలయికలో ఓ మూవీ ఓకే అయ్యింది. విక్రమ్‌తో తాను తీసిన ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌తో రీమేక్ చేసేందుకు శంకర్ సిద్ధమయ్యారు. అయితే ఈ మూవీకి ఒరిజినల్ నిర్మాత నుంచి చిక్కులు ఏర్పడ్డాయి. శంకర్ కూడా రామ్ చరణ్​, కమల్ హాసన్ సినిమాలతో బిజీగా మారారు. దీంతో రణ్​‌వీర్ చిత్రం అటకెక్కిందా అనే అనుమానాలు ఏర్పడ్డాయి. దీనిపై ఇప్పుడు ఓ వార్త బయటకొచ్చింది. 

‘వేల్పారి’ ట్రయాలజీకి ప్లాన్!
రణ్​‌వీర్‌తో శంకర్ తీయాల్సిన సినిమా ఆగిపోయిందట. దీని స్థానంలో మరో భారీ పాన్ ఇండియా మూవీని రణ్​‌వీర్‌తో తెరకెక్కించేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నారట. ప్రముఖ తమిళ నవల ‘వేల్పారి’ (Velpari) ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమవుతున్నారట. చరణ్​, కమల్‌తో తీస్తున్న చిత్రాలు పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని శంకర్ భావిస్తున్నారని తెలుస్తోంది. 

శంకర్ కెరీర్‌లో ఇదే భారీ చిత్రమట!
‘వేల్పారి’ నవలలో కథానాయకుడి పాత్ర లార్జర్ దెన్ లైఫ్ అనేలా ఉంటుందట. అలాగే ఇందులో నాయకా, నాయికల మధ్య హృద్యమైన ప్రేమకథ ఉంటుందట. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పలు సీక్వెన్సులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇండియాలో మునుపెన్నడూ తెరకెక్కనటువంటి స్థాయిలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తీయాలని శంకర్ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించి.. పలు భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. తొలి భాగం షూటింగ్‌ను 2023 ద్వితీయార్థంలో ప్రారంభించాలని అనుకుంటున్నారట. శంకర్, రణ్​‌వీర్ కెరీర్‌లో ఇది అతిపెద్ద చిత్రం కానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ రెండో, మూడో పార్ట్‌లో స్టార్ హీరోలు సూర్య, యశ్‌లు నటిస్తారని వార్తలు వస్తున్నాయి. మరి, దీనిపై శంకర్ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

Read more: తమిళ బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘లవ్ టుడే’ (Love Today) మూవీ.. తెలుగులో రిలీజ్ చేయనున్న దిల్ రాజు (Dil Raju)! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!