ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమాకు ప్ర‌శాంత్ నీల్ ఆ టైటిల్ పెడితే ఇక‌ అభిమానుల‌కు పూన‌కాలే!

Updated on Jun 05, 2022 02:52 PM IST
ఎన్టీఆర్ 31 (NTR 31) పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్‌ను చూస్తే అతి భీక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటాయ‌నిపిస్తుంది. ఇక అస‌రుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రుస్తారో చూడాలి. 
ఎన్టీఆర్ 31 (NTR 31) పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్‌ను చూస్తే అతి భీక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటాయ‌నిపిస్తుంది. ఇక అస‌రుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రుస్తారో చూడాలి. 

టాలీవుడ్‌లో ఎన్టీఆర్ (NTR) న‌ట‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. న‌ట‌న‌తో పాటు ఎలాంటి స్టెప్పులైనా అల‌వోక‌గా
చేసే స‌త్తా ఉన్న హీరో ఎన్టీఆర్. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమ‌రం భీముడా ఎన్టీఆర్ న‌టించాడు అనే కంటే  జీవించాడంటేనే క‌రెక్ట్ అంటున్నారు అభిమానులు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌లు న‌టించిన దేశ‌భ‌క్తి సినిమా రౌద్రం ర‌ణం రుధిరం. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌కు జాతీయ స్థాయిలో పేరు వ‌చ్చింది. స‌క్సెస్‌తో రేంజ్ పెంచుకున్న ఎన్టీఆర్ వ‌రుస అప్‌డేట్స్‌తో ప్రేక్ష‌కుల‌కు స‌ప్రైజ్ ఇచ్చారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 30 సినిమా చేయ‌నున్నారు. ఎన్టీఆర్ 31 (NTR 31) సినిమా త‌న డైరెక్ష‌న్లోనే అంటూ ప్ర‌క‌టించారు బ్లాక్ బాస్ట‌ర్ సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఫేం ప్ర‌శాంత్ నీల్(Prashanth Neel).

ఎన్టీఆర్ 31 చిత్రానికి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్
కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తో ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ లిస్టులో చేరారు. సినిమాకు క‌థే బ‌లం అనే మాట‌ను ప్ర‌శాంత్ నీల్ క‌చ్చితంగా పాటిస్తారు. బ‌ల‌మైన క‌థ‌లుగా కేజీఎప్ చాప్ట‌ర్ 1, కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 బంప‌ర్ హిట్ కొట్టాయి. ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా విడుద‌ల కానుంది. ఎన్టీఆర్ 31 అనే టెంప‌ర‌రీ పేరుతో ఈ సినిమా అనౌన్స్ చేశారు.  ఎన్టీఆర్ 31 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. ఎన్టీఆర్ 31 మూవీ టైటిల్ అసుర అంటూ ప్ర‌చారం సాగుతుంది. అసుర‌గా ఎన్టీఆర్ బీభ‌త్స‌మైన న‌ట‌న‌ను క‌న‌బ‌రుస్తార‌నే టాక్ వినిసిస్తుంది. ఎన్టీఆర్ 31 (NTR 31) పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్‌ను చూస్తే అతి భీక‌ర‌మైన స‌న్నివేశాలు ఉంటాయ‌నిపిస్తుంది. ఇక అస‌రుగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రుస్తారో చూడాలి. 

ఊరా మాస్ గెట‌ప్‌లో ఎన్టీఆర్!
ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ హ‌రోగా స‌లార్ సినిమా నిర్మిస్తున్నారు. స‌లార్ సినిమా షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రాథేశ్యామ్ ఫ్లాప్‌తో ప్ర‌భాస్ అభిమానులు నిరాశ‌గా ఉన్నారు. కానీ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న స‌లార్ అప్‌డేట్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ 31 మూవీని తెర‌కెక్కించ‌నున్నారు. మాస్ గెట‌ప్‌తో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ 31 (NTR 31) కు అసుర టైటిల్ క‌రెక్ట్ అని అంటున్నారు. 
Read More : https://telugu.pinkvilla.com/entertainment/komuram-bheemudo-full-video-song-461
 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!