ఎన్టీఆర్‌(NTR)కు జోడిగా ఆ హీరోయిన్‌ను తీసుకోవాలంటూ ఫ్యాన్స్ డిమాండ్

Updated on May 28, 2022 11:21 PM IST
ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రం శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా పెడితే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. 
ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రం శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా పెడితే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. 

ఆర్‌.ఆర్.ఆర్ సినిమాతో ఎన్టీఆర్ (NTR) మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొమురం భీముడిగా న‌టించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 సినిమాల ప్ర‌క‌ట‌న అభిమానుల‌కు రెట్టింపు ఉత్సాహం ఇచ్చింది. ఎన్టీఆర్‌కు జోడిగా ఏ హీరోయిన్‌ను తీసుకోవాలో అత‌ని అభిమానులు ద‌ర్శ‌కుల‌కు స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న డిమాండ్స్ మాములుగా లేవు

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌టన‌కు నేష‌న‌ల్ లెవ‌ల్‌లో పేరు వ‌చ్చింది. ఆ త‌ర్వాతి సినిమాల వివ‌రాలు కూడా ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఎన్టీఆర్ 30 మూవీలో న‌టించ‌నున్నారు తార‌క్. అలాగే, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 31 సినిమా చేయ‌నున్నారు. అయితే, ఎన్టీఆర్ (NTR) న‌టించ‌నున్న కొత్త సినిమాల్లో హీరోయిన్లు ఎవ‌ర‌నేదానిపై ఇంకా క్లారిటీ లేదు.

ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రం శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా పెడితే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. 

ఎన్టీఆర్‌తో జోడి క‌ట్టేదెవ‌రు?
ఎన్టీఆర్ (NTR) న‌టించ‌నున్న‌ సినిమాల్లో హీరోయిన్‌గా, ఫలానా కథానాయికను తీసుకోవాలని కూడా అత‌ని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో చేయ‌బోయే సినిమాలో శ్రీనిధి శెట్టిని తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఎన్టీఆర్‌తో శ్రీనిధి శెట్టి జ‌త‌క‌డితే బాగుంటుంద‌ని అంటున్నారు. ఇక కొర‌టాల శివ  సినిమా ప్రీ లుక్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ వీడియోకు మంచి స్పంద‌న వ‌చ్చింది.

అయితే ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ ఎవ‌రో ఇంకా ఫైన‌ల్ కాలేదు. అలియాభట్‌, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్‌, కియారా అద్వానీ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఏ భామ ఎన్టీఆర్‌తో స్టెప్పులు వేయ‌నుందో చూడాలి.. 

ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రం శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా పెడితే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. 

శ్రీనిధి శెట్టినే హీరోయిన్ అంటున్న ఫ్యాన్స్
ఎన్టీఆర్ 31 సినిమాను ఈ ఏడాది చివ‌రిలో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌నున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఎన్టీఆర్ 31 మూవీని నిర్మిస్తున్నాయి.  ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్, ప్ర‌భాస్ సినిమా స‌లార్‌తో బిజీగా ఉన్నారు. 'స‌లార్' పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా చేయ‌నున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

ప్ర‌శాంత్ కూడా త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో కేజీఎఫ్ చాప్ట‌ర్ 2, స‌లార్, ఎన్టీఆర్ 31 సినిమాల పోస్ట‌ర్ల‌ను, ఆర్డ‌ర్‌లో ఉన్న డీపిని పోస్టు చేశారు. అంటే ఈ మూడు సినిమాలు ప్ర‌శాంత్ నీల్‌కు, భారీ హిట్‌లు అందిస్తాయనే న‌మ్మ‌కం ఉంది. ఇక ఎన్టీఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ సాధిస్తుందో చూడాలి. ఎన్టీఆర్ (NTR) అభిమానులు మాత్రం, శ్రీనిధి శెట్టిని యంగ్ టైగర్‌కు హీరోయిన్‌గా జతకడితే బాగుంటుందంటూ పోస్టులు పెడుతున్నారు. 

 

తార‌క్ (NTR) సినిమాలో ప్ర‌శాంత్ నీల్ శ్రీనిధిని తీసుకున్నారేమో అన్న డౌట్ కూడా వ‌స్తుంది

ఎన్టీఆర్‌కు జోడిగా శ్రీనిధి శెట్టినా?
శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) న‌టించిన తొలి సినిమా 'కేజీఎఫ్' . ఆ త‌ర్వాత 'కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2' లోనూ న‌టించారు. పాన్ ఇండియా సినిమాతో వెండితెర‌కు ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. ప్ర‌స్తుతం శ్రీనిధి శెట్టికి చాలా డిమాండ్ ఉంది. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 3' కూడా ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం శ్రీనిధి విక్ర‌మ్‌తో 'కోబ్రా' సినిమాలో న‌టిస్తున్నారు. కోబ్రా విడుద‌ల‌కు రెడీ అవుతుంది.

అంతకు మించి, శ్రీనిధి శెట్టి కొత్త ప్రాజెక్టుల వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. అలాగే, తార‌క్ సినిమాలో ప్ర‌శాంత్ నీల్, శ్రీనిధిని తీసుకున్నారేమో అన్న డౌట్ కూడా వ‌స్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్  అనుకున్న‌ట్టు ప్ర‌శాంత్ నీల్, ఎన్టీఆర్ (NTR) తో స్టెప్పులు వేయించ‌డానికి శ్రీనిధి శెట్టిని తీసుకుంటాడో లేదో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!