Indian 2 : ‘ఇండియన్ 2’ షూటింగ్‌ ప్రారంభం.. రెండేళ్ల త‌రువాత న‌టిస్తున్న‌ క‌మ‌ల్ (Kamal Haasan)?

Updated on Sep 22, 2022 08:15 PM IST
ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాకు అన్ని అడ్డుంకులు తొలిగిపోవ‌డంతో క‌మ‌ల్ (Kamal Haasan), శంక‌ర్ మ‌రో రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాకు అన్ని అడ్డుంకులు తొలిగిపోవ‌డంతో క‌మ‌ల్ (Kamal Haasan), శంక‌ర్ మ‌రో రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Indian 2 : విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) న‌టించిన 'భార‌తీయుడు' సినిమాకు సీక్వెల్‌గా 'ఇండియ‌న్ 2' చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభ‌మైంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో దిగిన ఫోటోల‌ను క‌మ‌ల్ హాస‌న్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'ఇండియ‌న్ 2' సినిమా షూటింగ్ లొకేష‌న్‌లో వీరు దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌మ‌ల్ హాస‌న్ కొత్త గెట‌ప్ ఆస‌క్తిగా క‌నిపించింది. 

క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో  21 ఏళ్ల క్రితం విడుద‌లైన 'భార‌తీయుడు' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో శంక‌ర్ స్టార్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఇక క‌మ‌ల్ హాస‌న్ పాన్ ఇండియా హీరో స్థాయికి ఎదిగారు. అవినీతిపై పోరాడే ఓ మాజీ సైనికాధికారిగా క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు సినిమాలో జీవించారు. ఈ సినిమాలో డ‌బుల్ రోల్‌లో న‌టించారు. 

సినిమా త్వ‌ర‌గా పూర్తిచేస్తార‌ట‌!

2017లో 'ఇండియ‌న్ 2' సినిమా చిత్రీక‌రించాల‌ని అనుకున్నారు. కానీ న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు రావ‌డంతో ఆల‌స్య‌మైంది. ఆ త‌రువాత కోవిడ్ కార‌ణంగా మ‌రింత జాప్యం జ‌రిగింది. ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' సినిమాకు అన్ని అడ్డుంకులు తొలిగిపోవ‌డంతో క‌మ‌ల్, శంక‌ర్ మ‌రో రికార్డు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రెండేళ్ల త‌రువాత క‌మ‌ల్ హాస‌న్ 'ఇండియ‌న్ 2' (Indian 2) సినిమాలో న‌టిస్తున్నారు. 

ఈ సినిమాను వీలైనంత త్వ‌రగా పూర్తి చేయాల‌ని శంక‌ర్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను శంక‌ర్ చిత్రీక‌రిస్తున్నార‌ని స‌మాచారం.క‌మ‌ల్‌తో 'ఇండియ‌న్ 2', రామ్ చ‌ర‌ణ్‌తో 'ఆర్‌సీ 15' చిత్రాల‌ను ఏక‌కాలంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప‌ట్టాలెక్కిస్తున్నారు. 

'ఇండియ‌న్ 2' చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్, సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్, మ‌నోబాల‌, వెన్నెల కిషోర్, సముద్ర ఖని, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌జియాంట్‌ మూవీస్‌ బ్యానర్‌లపై సుభాస్కరణ్‌, ఉదయనిధి స్టాలిన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఇండియ‌న్ 2' చిత్రాన్ని 2023లో రిలీజ్ చేయ‌నున్నారు. 

Read More: క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) ‘ఇండియన్ 2’ షూటింగ్ షురూ!.. 'ఆర్‌సీ 15 సంగ‌తేంటి? శంక‌ర్' అంటున్న మెగా ఫ్యాన్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!