క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) ‘ఇండియన్ 2’ షూటింగ్ షురూ!.. 'ఆర్‌సీ 15 సంగ‌తేంటి? శంక‌ర్' అంటున్న మెగా ఫ్యాన్స్ !

Updated on Aug 24, 2022 03:49 PM IST
క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'భార‌తీయుడు' సినిమాకు సీక్వెల్ 'ఇండియ‌న్ 2'  శంక‌ర్ డైరెక్షన్‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.
క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'భార‌తీయుడు' సినిమాకు సీక్వెల్ 'ఇండియ‌న్ 2' శంక‌ర్ డైరెక్షన్‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.

Indian 2: లోక నాయకుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'విక్ర‌మ్' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 'విక్ర‌మ్' సినిమా త‌రువాత డైరెక్టర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు కమల్. అదే 'ఇండియన్ 2'.  ఎన్నో వివాదాల తర్వాత, ఎట్టకేలకు ఈ చిత్రం పట్టాలెక్కడంతో క‌మ‌ల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శంక‌ర్ సినిమాకు అడ్డంకులు తొలిగాయని ఆనందపడుతున్నారు. అయితే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న "RC 15" ప‌రిస్థితి ఏంటి?.
 

'ఇండియ‌న్ 2' షూటింగ్ మొద‌లు

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ (S. Shankar) సామాజిక సమస్యల‌ను ప్రధానాంశాలుగా తీసుకొని, సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటారు. ప్ర‌స్తుతం తెలుగు హీరో రామ్ చ‌ర‌ణ్‌ కథానాయకుడిగా 'ఆర్‌సీ 15' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మ‌రోవైపు, విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'ఇండియ‌న్ 2' కూడా ఈయన డైరెక్షన్‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ ఇది. 

'ఇండియ‌న్ 2' సినిమా షూటింగ్ ఆగ‌స్టు 24 నుంచి మొదలుకానుంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 'ఇండియ‌న్ 2' షూటింగ్‌కు క‌మ‌ల్ హాస‌న్ సెప్టెంబ‌ర్ నుంచి హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. 

 క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'భార‌తీయుడు' సినిమాకు సీక్వెల్ 'ఇండియ‌న్ 2'  శంక‌ర్ డైరెక్షన్‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది.

రామ్ సినిమాకు బ్రేక్

క‌మ‌ల్ హాస‌న్ చిత్రం 'భార‌తీయుడు'కి సీక్వెల్‌గా వ‌స్తున్న 'ఇండియ‌న్ 2' సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే శంక‌ర్ తాము అనుకున్న స‌మ‌యానికి 'ఇండియ‌న్ 2' సినిమాను తెర‌కెక్కించ‌డం లేదంటూ, గ‌తంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఆరోపించింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్ర‌యించింది.

అయితే శంక‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది మాత్రం 'ఇండియ‌న్ 2' చిత్రానికి విదేశీ సాంకేతిక నిపుణుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే  షూటింగ్ ఆల‌స్యమైందని వాదించారు. ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 2' నిర్మాణానికి చిక్కులు తొలిగిపోవ‌డంతో, శంక‌ర్ క‌మ‌ల్ సినిమాను మొద‌లు పెట్టాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. శంక‌ర్ 'ఇండియ‌న్ 2' సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న 'ఆర్‌సీ 15' చిత్రీక‌ర‌ణ‌కు కాస్త బ్రేక్ ఇచ్చార‌ని టాక్.  

Read More: డాక్ట‌రేట్ అందుకున్న ద‌ర్శ‌కుడు శంక‌ర్ (S. Shankar)... గొప్ప ప్రోత్సాహమ‌న్న స్టార్ డైరెక్ట‌ర్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!